Revanth Reddy gave 24 hours time to Bandi Sanjay: ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్ అంటూ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల అప్లికేషన్ లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్టు మోడీ చెప్పారని తెలిపారు. 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు పార్లమెంట్ లో మోడీ సమాధానం ఇచ్చారని రేవంత్ అన్నారు. దేశ ప్రజలను మోసం చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా మోడీ చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. బండి సంజయ్ మాత్రం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్రం భోజనంకి… నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్టు ఉంది బండి మాటలు అంటూ ఎద్దేవ చేశారు. గ్రేటర్ లో బండి పోతే బండి ఇస్తా అని.. తర్వాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు అంట అంటూ వ్యంగాస్త్రం వేశారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పు బండి సంజయ్ అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోనీ ఎన్ని శాఖలు ఉన్నాయో చెప్పు కనీసం.. 24 గంటల సమయం ఇస్తున్నానని తెలిపారు.
Read also: DAV school incident: డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటనలో కోర్టు సంచలన తీర్పు.. 20 ఏళ్ల జైలు శిక్ష
మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని పదేళ్లు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలన్నారు. కేసీఆర్ కూడా ఇంటికో ఉద్యోగం అన్నారని.. నిరుద్యోగులను మోడీ, కేసీఆర్ మోసం చేశారని తెలిపారు. విద్యార్థుల శవాలతో పునాదులు వేసుకుని వారి త్యాగాల మీద అధికారంలోకి వచ్చారు కేసీఆర్ అంటూ ఆరోపణలు గుప్పించారు. పేపర్ లీక్ లో కేటీఆర్ ని ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి ఇవ్వండి అంటే గవర్నర్ స్పందించలేదని మండిపడ్డారు. Tspsc రద్దు చేసే అధికారం గవర్నర్ కి ఉందని గుర్తు చేశారు. అయినా కూడా రద్దు చేయలేదు గవర్నర్ అంటూ మండిపడ్డారు. విచారణ చేయాల్సిన సిట్ చిన్న ఉద్యోగులు ఇద్దరిని విచారించి చేతులు దులుపుకుందాం అనుకున్నది అని ఆరోపించారు. ఈడీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగిందని గుర్తు చేశారు. సిట్ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలను రక్షించే ముసుగు గా మారిందని మండిపడ్డారు. కానీ సిట్ విచారణ ముందుకు పడటం లేదన్నారు. మే మొదటి వారంలో తెలంగాణ కి ప్రియాంక గాంధీ కానున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ సభకు ప్రియాంక హాజరు కానున్నారని తెలిపారు. అందరి సహకారం తోసుకోవాలి అనేది మా ఆలోచన అని, ఎవరిని పిలవాలి అన్నది పార్టీలో చర్చ చేస్తామన్నారు. బండి సంజయ్ రేస్ కోర్టు లో మోడీ ముందు నిరుద్యోగ మార్చ్ చెయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Bandi sanjay: అక్కడ నిర్మాణం ఎలా చేపడతారు? కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
లేదంటే ఆమరణ నిరాహారదీక్ష అయినా చెయ్ అంటూ రేవంత్ మండిపడ్డారు. పదో తరగతి ప్రశ్న పత్రం లీక్ చేసిన బండి అంట… రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు అంట అంటూ ఎద్దేవ చేశారు. 21 న నల్గొండ యూనివర్సిటీ లో నిరసన అనంతరం మే4న లేదంటే 5న సరూర్ నగర్ లో నిరుద్యోగ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాంతాచారి విగ్రహం నుండి ర్యాలీ చేపడతామన్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ వస్తున్నారని, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాలని పిలుపు నిచ్చారు. మే 9 నుండి రెండో విడత పాదయాత్ర ప్రారంభిస్తామని, జోగులంబా నుండి ప్రారంభిస్తా అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ సమస్య లో బీఆర్‌ఎస్.. బీజేపీ ఇద్దరూ నేరగాళ్లు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ చేశారు అని.. ఎన్‌ఎస్‌యూఐ..యూత్ కాంగ్రెస్ ధర్నా చేస్తే ఐదు రోజులు జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ చేసిన బండి సంజయ్ పొద్దున్నే బయటకు వచ్చారని మండిపడ్డారు. అత్తగారి ఇంటికి పోయి వచ్చినట్టు బయటకు వచ్చాడని నిప్పులు చెరిగారు. దీన్ని బట్టి చూస్తే అర్థం అవ్వడం లేదా బీఆర్‌ఎస్, బీజేపీ బంధం అంటూ ఆరోపణలు గుప్పించారు. జైల్ కి పోయిన అతను 420 నే.. జైల్ కి పంపిన అతను 420 నే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిరుద్యోగ నిరసన అనంతరం 24న ఖమ్మం జిల్లాలో ఆతరువాత 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Sreemukhi: రంగుదుస్తుల్లో రెచ్చిపోయిన రాములమ్మ