వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్…. అసెంబ్లీ లో మేము ఆ చట్టాలను అమలు చేయమని కేసీఆర్ తీర్మానం చేయవచ్చుకదా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తీర్మానం చేయకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు అని అడిగారు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయనంత వరకు కేసీఆర్ వి దొంగ నాటకాలు మాత్రమే. కేసీఆర్ నీది ప్రభుత్వమా… బ్రోకరేజి చేస్తున్నావా అన్నారు. రాష్ట్ర సర్కారు మార్కెట్ ఇంట్రవెంషన్ తో ధాన్యం కొనుగోలు చేయాలి. వరి వద్దన్న కేసీఆర్… ఏ పంటలు వేయాలి …ఎంతకు రైతుల నుంచి ఆ పంటలు కొనుగోలు చేసేది ముందు చెప్పాలి. తెలంగాణ సర్కారు కు ఒక అగ్రికల్చర్ పాలసీ అంటూ లేదు. నేను అగ్రికల్చర్ పాలసీ కోసం హైకోర్టు లో పిల్ వేస్తే …అది బెంచ్ మీద రాకుండా సర్కార్ చేస్తుంది. నూజివీడు, కావేరి లాంటి సీడ్ కంపెనీలకు కేసీఆర్ అమ్ముడుపోయారు. కేసీఆర్ ప్రజలు ఓటు వేసింది ధర్నా చేయటానికా… ప్రభుత్వం నడపడానికా అని అడిగారు.
ఇక కేసీఆర్ కుటుంబ దోపిడీ కాపాడుకోవడం కోసం మోడీ కి మద్దతు. మోదీ మీద నమ్మకంతో కేసీఆర్… నన్ను దమ్ము ఉంటే టచ్ చేయాలని బండి సంజయ్ కు సవాలు చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్న ఆస్తులు ఎట్లా వచ్చనయో చెప్పాలి. కేసీఆర్ ఆంధ్రకే సపోర్ట్ చేస్తారు. చేప కూర తిను…ఇప్పపువ్వు సారా తాగు…అది కేసీఆర్ ఇష్టం. బీజేపీని కేసీఆర్ తిట్టలేదు…బండి సంజయ్ ను విమర్శించారు. ఇటీవలే ఆదిలాబాద్ కు వచ్చినప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి గురించి మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీని అడగడం లేదు… అడిగితే వెంటనే ధాన్యం కొంటారు. మోదీ,అమిత్ షా తో కేసీఆర్ కు మంచి అనుబంధం ఉంది. కీలకమైన వ్యక్తుల మీద కేంద్రం కేసులు పెట్టింది…కేసీఆర్ కుటుంబం తప్పా. అందుకే అసెంబ్లీ లో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్ తీర్మానం చేయడం లేదు అని పేర్కొన్నారు.
