NTV Telugu Site icon

రేవంత్‌రెడ్డి ఫైర్.. ఊర్లకు వస్తే ఉరికించి కొడతాం..!

Revanth Reddy

Revanth Reddy

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కొత్త పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌ రెడ్డి కామెంట్‌ చేయడం.. దానికి కౌంటర్‌గా ఆ ఎమ్మెల్యేలు ఎదురు దాడిగి దిగడం జరిగిపోయాయి.. మీరు రాళ్లు విసిరితే.. మేం చెప్పులతో కొడతామంటూ హాట్ కామెంట్లు చేశారు పార్టీ వీడిన ఎమ్మెల్యేలు.. అయితే, ఆ వ్యాఖ్యలపై మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేరన్న ఆయన.. తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు.. ఎర్రబెల్లి, తలసాని, సబితా, గంగుల, పోచారం… ఇలా అందరూ తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్లేనని ఫైర్‌ అయిన ఆయన.. దానం నాగేందర్ కి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఏముంది.. బొంగు ఉందా అని అడుగుతున్నాడు.. ఈ బొంగు పార్టీనే నీకు బతుకు పెట్టిందని.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే రోడ్డు మీద పిచ్చి కుక్క కంటే హీనంగా ఉండేవాడివంటూ మండిపడ్డారు.

పిచ్చి పిచ్చిగా మాట్లాడితే… వీపులు విమానం మోత మోగుతాయి అంటూ వార్నింగ్‌ ఇచ్చారు రేవంత్ రెడ్డి.. పార్టీ మారిన ఎమ్మెల్యే లు… రద్దైన వెయ్యి రూపాయల నోట్లు లాంటివాళ్లన్న ఆయన.. మీకు చీము.. నేత్తురు ఉంటే ఎమ్మెల్యే లుగా రాజీనామా చేసి రండి అంటూ సవాల్‌ విసిరారు… మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించిన రేవంత్‌ రెడ్డి.. మీరు ఊర్లకు వస్తే ఉరికించి కొడతారు కాంగ్రెస్ కార్యకర్తలు అని వ్యాఖ్యానించారు. మీ అందరి తాటా తియిస్తా అంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన ఆయన.. మీరు చెప్పులతో కొట్టుడు కాదు… మీకు చెప్పుల దండ వేయిస్తా… ఇన్ని రోజులు మా నాయకులు మర్యాదగా ఉండాలని అనుకున్నారు.. 7వ తేదీ తర్వాత మిమ్మల్ని కొరివి దెయ్యాలను ఊరు దాటించినట్టు తరిమెఓస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.