Site icon NTV Telugu

Revanth Reddy : కర్ణాటక ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారు

Tpcc Chief Revanth Reddy Challenge To Cm Kcr And Ktr

Tpcc Chief Revanth Reddy Challenge To Cm Kcr And Ktr

గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరారు. ఈ నేపథ్యంలో వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీని ఎవడు ఓడించలేడు అనుకున్నానని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి చూపించిందన్నారు. జేడీఎస్‌ కోసం.. కాంగ్రెస్ ని చీల్చాలని .. కేసీఆర్ కూడా కృషి చేశారని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు విజ్ఞతతో వ్యవహరించారని ఆయన ప్రశంసించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి… కర్నాటకలో బీజేపీ కి పోలిక ఉందని, ఇక్కడ 30 శాతం కమిషన్ సర్కార్, కర్ణాటక లో 40 శాతం కమిషన్ సర్కార్ అని ఆయన అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గురించి మాట్లాడేందుకు నాకే సిగ్గు ఐతుందన్న రేవంత్‌ రెడ్డి.. కానీ కేసీఆర్ పక్కన ఎలా కూర్చోపెట్టుకుంటున్నారోనని సెటైర్లు వేశారు.

Also Read : Kishan Reddy : PFC ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ

దుర్గం చిన్నయ్య నో.. దుర్బుద్ధి చిన్నయనో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఏ అరాచకం చూసినా బీఆర్‌ఎస్‌ నాయకులు ఉంటున్నారని, ఇంతకు ముందు… రాజకీయ నాయకుల మీద అవినీతి ఆరోపణలు వచ్చేవని, కానీ ఇప్పుడు అత్యాచారం కేసుల్లో కూడా బీఆర్‌ఎస్‌ నేతలు ఉంటున్నారన్నారు. టీఎస్సీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సమీక్ష చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విచారణ అధికారులు.. ప్రభుత్వ పెద్దలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం తప్పని కోర్టు చెప్పిందని, ప్రశ్నా పత్రం లీకుకి కేటీఆర్ కారణమని, కేటీఆర్‌ని బర్తరఫ్ చేయాలన్నారు. అంతేకాకుండా.. ఆయన ధన దహమే లీకులకు కారణమని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఇంచార్జి మానిక్‌ రావ్‌ థాక్రేతో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి.. నాగం జనార్థన్‌ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు.

Also Read : Kishan Reddy : PFC ద్వారా రుణాలు పొందిన రాష్ట్రాల్లో నంబర్ వన్ తెలంగాణ

Exit mobile version