బీజేపీపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఢిల్లీలో ఆయన మాట్లాడారు. మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి స్వాగతం పలికారు. ప్రవీణ్ రెడ్డి రావటం వల్ల హుస్నాబాద్ లో కాంగ్రెస్ మరింత బలోపేతం కానుందన్నారు. తెలంగాణా సమాజం కాంగ్రెస్ లోకి రావాలి. వరదలు వస్తే అప్రమత్తం చెయ్యాల్సిన సీఎం, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడని రేవంత్ మండిపడ్డారు. వరదలు వచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే, ముఖ్యమంత్రి రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాడు.
క్లౌడ్ బరస్ట్ అనే కామెంట్స్ అత్యత నిర్లక్ష్యమయినవి. అవినీతి పై చర్చ జరక్కుండా ఈ చర్చ తెరపైకి తెచ్చారు. పోలవరంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలి. నిజమే అయితే ఇన్ని రోజులెందుకు అభ్యంతరం వెలిబుచ్చలేదు. కేసీఆర్ చెప్పింది నమ్మాలా అజయ్ చెప్పింది నమ్మాలా? సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 11 లక్షల హెక్టర్ల పంట పాడయింది. ముందు విదేశాల కుట్ర అన్నారు, ఇపుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారు. వరదల్లో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి.
రాష్ట్రంలో తలెత్తిన వరద సమస్యలపై, నష్టాలపై సంపూర్ణమయిన నివేదికను కేంద్రానికి నివేదించాలి. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వచ్చి, కేంద్రానికి నివేదించి, సహాయక చర్యలకోసం కార్యాచరణ తీసుకోవాలి. కేంద్రం నుంచి 2 వేల కోట్లు సాధించాలి. కేంద్రం ఇప్పటికి పరిశీలక బృందాలను తెలంగాణ కు పంపలేదు. 21 నుంచి తెలంగాణ లో బిజెపి కార్యక్రమాలు అంటున్నారు, ప్రజలు బీజేపీని అడ్డుకోవాలి. తెలంగాణ ప్రజల ప్రాణాలంటే బీజేపీకి విలువ లేదు. బీజేపీని తెలంగాణకు రానిస్తే, మరింత ప్రమాదకరం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు రేవంత్.
Governor Tamilisai: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు