రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వ్యవహారంపై ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. అస్సాం ముఖ్యమంత్రి డీఎన్‌ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు ఆయన డీఎన్‌ఏ చైనాదా? అస్సాందా? అనేది తేలాలన్నారు. ఇక, మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్‌రెడ్డి.. భారత్ మాతాకు పుట్టినోల్లా… బీజేపీ నేతలు అంతా ? అని ప్రశ్నించిన ఆయన.. ఇలాంటి సంస్కార హీనమైన చర్చ చేయాలని కాంగ్రెస్స్ అనుకోవడం లేదన్నారు.
Read Also: Special Status: తెలంగాణకు సంబంధంలేదు.. ప్రత్యేకంగా చర్చ..!
రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుందాం అనుకున్నాం.. కానీ, వాటిని రద్దు చేస్తున్నామని తెలిపారు రేవంత్‌రెడ్డి.. అస్సాం సీఎంపై కార్యాచరణ ఉంటుందన్న ఆయన.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై కేసులు పెడతాం అన్నారు.. ఇక, సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అస్సాం సీఎం మీద కేసులు పెట్టి నిరూపించుకోవాలని.. అప్పుడే కేసీఆర్ ఎవరికీ భయపడ్డడు అని అనుకుంటాం అని వ్యాఖ్యానించారు… కేసు పెట్టి హిమంత బిస్వా శర్మను తెలంగాణను రప్పించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
