Revanth Reddy: వ్యక్తిగత అంశాలపై కాకుండా.. ప్రజల సమస్యలపై చర్చ పెట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: కశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్రలో మనం కూడా పాల్గొనాలని, వ్యక్తిగత అంశాలు చర్చ పెట్టకుండా ..ప్రజల సమస్యలపై చర్చ పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సలహా ఇచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్ లో 138వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. స్వాతంత్ర ఉద్యమం నుండి నేటి వరకు వ్యక్తుల ప్రయోజనం కంటే దేశ ప్రయోజనమే లక్ష్యంగా పని చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు వదిలారని తెలిపారు. గాంధీ బలిదానం అయినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాంగ్రెస్ అని తెలిపారు రేవంత్ రెడ్డి. విదేశీ శక్తుల కుట్రతో రాజీవ్ హత్య జరిగిందని ఆరోపించారు. ఉపాధి హామీ.. విద్యాహక్కు..సమాచార హక్కు చట్టాలు తెచ్చింది సోనియా గాంధీ అని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి. మహిళా రిజేర్వేషన్ బిల్లుకు అడ్డుపడింది బీజేపీ అని ఆరోపించారు. జానారెడ్డి 2011లో తెలంగాణలో కాంగ్రెస్ మహిళలకి 50 శాతం రిజర్వేషన్ అమలు చేశారన్నారు.
Read also: Lionel Messi: ధోనీ కుమార్తెకు ఫుట్‌బాల్ స్టార్ అపురూప కానుక
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
బీజేపీ బ్రిటిష్ సిద్ధాంతం ప్రజలపై రుద్దాలని చూస్తుందని మండిపడ్డారు. దేశానికి వస్తున్న ముప్పు నుండి కాపాడటం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ తెలిపారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. దేశం మీద పాక్.. చైనా దాడులు చేయాలని కుట్ర చేస్తున్నాయి అని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దేశం ప్రమాదంలో ఉందని, కానీ బీజేపీకి ప్రభుత్వాలు కూల్చడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కోవిడ్ పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర ని ఉపసంహరించుకోవాలని బీజేపీ కుట్ర చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో దోపిడీ చాలదు అన్నట్టు కేసీఆర్ పార్టీని దేశ వ్యాప్తం చేయాలని చూస్తున్నారని.. అందుకే పార్టీ విస్తరణ అన్నారు. తెలంగాణ లో ఎన్నో సమస్యలు ఉన్నా ఎందుకు బీజేపీ మీద కొట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ జరుగుతుంటే ఢిల్లీలో ఉన్న కేసీఆర్.. ఎందుకు మాట్లాడలేదన్నారు. మనకున్న చిన్న చిన్న సమస్యల కంటే ప్రజల సమస్యలు పెద్దవని రేవంత్ గుర్తుచేశారు. ప్రజల కోసం జనవరి 26 నుండి ప్రతి ఇంటికి కార్యకర్త చేరుకోవాలని పిలుపు నిచ్చారు. బీజేపీ, కేసీఆర్ ల ప్రజా వ్యతిరేక విధానాలు చెప్పాలని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు కోరారు.
Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!