Site icon NTV Telugu

Revanth Reddy : అలా అయితే.. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి… రేవంత్‌ సవాల్‌

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy Criticized bjp and trs

తెలంగాణ రాజకీయ ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే.. ఇంకా ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనప్పటికీ.. ఆయా రాజకీయా పార్టీలు మునుగోడులో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నేడు మునుగోడులో పాదయాత్రి నిర్వహించారు.ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నీ చేర్చుకునేటప్పుడు రాజీనామా చేసి తీసుకుంటున్న బీజేపీ కి సిగ్గు లేదని.. సర్పంచ్… జడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా రాజీనామా చేయించి ఎందుకు చేర్చుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. వాళ్ళు రాజీనామా చేస్తే గ్రామాలకు నిధులు వస్తాయి…అభివృధ్ది చెందుతుంది. ఉప ఎన్నికలతో నే అభివృద్ధి అని చెప్తున్న బీజేపీ నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలి.

బీజేపీ లో చేరుతున్న సర్పంచ్…ఎంపీటీసీ.. జడ్పీటీసీలతో కూడా రాజీనామా చేయించాలి. అప్పుడు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మునుగోడు రైతులకు బకాయి పడ్డ 300 కోట్ల పంట రుణాలు మాఫీ వెంటనే విడుదల చేయాలి. పాలమూరు ప్రాజెక్ట్ నీ అమిత్ షా జాతీయ ప్రాజెక్టు గా ప్రకటించాలి. టీఆర్‌ఎస్‌.. బీజేపీ ఆంబొతులా కొట్లాడి ప్రజలను పక్కదారి పట్టించే పనిలో ఉన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఎందుకు ఆగిపోయాయి అనేది కేసీఆర్ సమాధానం చెప్పాలి. అమిత్ షా వేదికపై ఐదు వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి. బీజేపీ ఎంపీల రాజీనామా ప్రకటించాలి. రాజీనామాలతో అభివృద్ధి అయితే.. బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని రేవంత్ సవాల్ విరిసారు. అంతేకాకుండా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టార్ క్యాంపెనర్… ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

Exit mobile version