డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో మేం ఎవర్ని అయినా విడిపించమని ఆడిగామా అన్నారు రేవంత్.
అందరి నమూనాలు ఎందుకు సేకరించలేదు. నా వాళ్ళున్నా శిక్షించండి. మా వాళ్లపై అనుమానాలు ఉంటే, ఏ ఆస్పత్రి కైనా తీసుకు వచ్చి డ్రగ్ టెస్ట్ చేయిస్తా. నైతిక బాధ్యతతో ఉన్నాను. 142 మంది నమూనాలు ఎందుకు సేకరించ లేదు. మీకు కావలసిన వాళ్ళున్నారనే, అందరిని వదిలేశారు. పిల్లల్ని అడ్డు పెట్టి మా పై రాజకీయమా.. ఇది చిల్లర రాజకీయం. మా పిల్లలను తీసుకు వచ్చి టెస్ట్ చేయిస్తా..నీ కొడుకుకు టెస్ట్ చేయిస్తావా కేసీఆర్ అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ని డ్రగ్స్ హబ్ గా మార్చే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తుంది. డ్రగ్స్ పై విచారణ కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బీజేపీ, టీఆర్ఎస్ లు రాజకీయం చేస్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే కళ్ళాల్లోకి కాంగ్రెస్ నిర్వహించాం. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనంలా మారింది. రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని, కేంద్రం కొనాలి.
https://ntvtelugu.com/pudding-and-mink-pub-case-enquiry/
తెలంగాణ లోని రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కుమ్మక్కు అయ్యారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు. కనీస మద్దతు ధర కంటే, తక్కువకు కొంటున్న మిల్లర్ల పై కేసులు పెట్టాలన్నారు. రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమo చేపడతామన్నారు. ఎల్లుండి సివిల్ సప్లై, విద్యుత్ సౌధలను ముట్టడిస్తాం. కేసీఆర్ కు రైతులను ఆదుకోవాలని ఉంటే, పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చెయ్యాలి. మోడీకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. ప్రధాన మంత్రిని కలిసేందుకు ఎంపీలు, సీఎం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రధాని మోడీని కలవాలన్నారు రేవంత్ రెడ్డి.
