Site icon NTV Telugu

CM Revanth Reddy : ఆస్తి పంచాయితీల వల్లనే.. కేసీఆర్‌ కుటుంబంలో సమస్య

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీలకు సంబంధించిన పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “నేను ఎక్కడా కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఇది వారి ఇంటి సమస్య. ఆస్తి తగాదాల వల్ల వారి కుటుంబ సమస్యలు బజారున పడ్డాయి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారు. ఆ నలుగురిని తెలంగాణ ప్రజలు బహిష్కరించారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని గతంలో కిషన్ రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. “సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో దర్యాప్తు జరుపుతామని కిషన్ రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడటం లేదు? కేటీఆర్ ఏం చెబితే కిషన్ రెడ్డి అది చేస్తారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కేసు నుంచి సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం సీబీఐ విచారణ జరపకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ గాయాలు.. టీం కీలక ప్రకటన

హైదరాబాద్ మెట్రో రైలుపై మాట్లాడుతూ, ఎల్ అండ్ టి తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. “ఎల్ అండ్ టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎల్ అండ్ టితో ఒప్పందం కుదుర్చుకోవాలని చెబుతోంది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం బయటకు పోతుందని ఎక్కడ చెప్పలేదు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. “మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్‌ను కంట్రోల్ చేస్తున్నాం. మా ఈగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారిని పట్టుకుంది. హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ గత ప్రభుత్వంలోనే ఏర్పడింది. కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో దొరికారు” అని ఆరోపించారు.

2014-19 మధ్య టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, చట్టసభల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

“కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. హరీష్ రావే మాకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు” అని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. “రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. బీజేపీ, టీఆర్‌ఎస్ ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయి” అని విమర్శించారు.

నక్సలైట్లు లొంగిపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చాయని చెప్పారు. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు, నక్సలైట్లతో చర్చలు చెప్పడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. “లోకేష్ నాకు తమ్ముడు లాంటివాడు అని కేటీఆర్ చెప్పారు. మరి తమ్ముడు లోకేష్ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు” అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Alluri Seetharamaraju: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రో పవర్ ప్లాంట్స్కు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన

Exit mobile version