Site icon NTV Telugu

Revanth Reddy: రేవంత్ కి కోపం వచ్చిందా?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముందస్తు ఎన్నికల గురించి ఈమధ్యే తన జోస్యం చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్. తాజాగా ఆయనకు కోపం వచ్చింది. సొంత పార్టీ నాయకుల నుంచి వచ్చిన కౌంటర్లకు ఎదురు దాడికి దిగారు. ఇక మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించారు టీపీసీసీ చీఫ్‌. చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు.

బీహార్ ఐఏఎస్‌లపై రేవంత్ చేసిన కామెంట్స్‌కి వీహెచ్‌, మధు యాష్కీ కౌంటర్ ఎటాక్ చేశారు. అయితే ఐదుగురు ఐఏఎస్ అధికారుల దగ్గరే 40 శాఖలు ఉంటే మాట్లాడటం తప్పెలా అవుతుందన్నారు రేవంత్‌. మన వాళ్ళు కొంత అవగాహన లేక మిడి మిడి మాటలు మాట్లాడుతున్నారన్నారు. తాను తెలివి తక్కువగా మాట్లాడటం లేదన్నారు రేవంత్. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కి రేవంత్ స్పందించారు.

సంక్షేమ పథకాలపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి అధికారిక లాంఛనాలతో తీసుకెళ్తానని.. కేటీఆర్‌ను రమ్మని కోరారు. మాట మీద నిలబడితే రావాలని… సినిమా మిత్రులకు రెండు రోజులు సమయం తగ్గించి.. చర్చలకు వస్తే మంచిదని సూచించారు. మంత్రి కేటీఆర్‌కు 30 రోజులు గడువు ఇస్తున్ననన్నారు రేవంత్. మొత్తానికి చాలా రోజుల తర్వాత.. సొంత పార్టీ నాయకులపై కౌంటర్ ఎటాక్ చేశారు రేవంత్. చూడాలి మరి ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

https://ntvtelugu.com/womens-day-special-police-station-duties-to-women-ci/
Exit mobile version