NTV Telugu Site icon

Revanth Reddy: కేసీఆర్‌కు రేవంత్ ఛాలెంజ్.. తాడోపేడో

Revanth Reddy On Kcr

Revanth Reddy On Kcr

Revanth Reddy Again Challenges CM KCR: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌కి సవాల్ విసిరారు. ఏ ఊర్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చావో అక్కడ నువ్వు గెలిపించుకో అని, ఇళ్లు ఇవ్వని చోటా తాము గెలిపించుకుంటామని అన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం, దళిత బందు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల భూములని ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి, బీఆర్ఎస్ పార్టీలకు చెరో పది సంవత్సరాలు అధికారం ఇచ్చారని.. ఈసారి కాంగ్రెస్‌కి అవకాశం ఇవ్వండని ప్రజల్ని కోరారు. ఐనవోలు మండలం పేరుమాండ్ల గూడెంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో యువకులపై కేసులు పెట్టి, పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు.

Nirmala Sitaraman: కేసీఆర్‌పై నిర్మలా ఫైర్.. జోకులు వద్దంటూ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తే.. కేసీఆర్‌కి రెండుసార్లు పట్టం కట్టారని రేవంత్ పేర్కొన్నారు. కానీ దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి, డబుల్ బెడ్‌రూం వంటి హామీలిచ్చి మోసం చేశారన్నారు. అన్ని కులాల వారికి కుల వృత్తుల పేరుతో ఉంటే.. కేసీఆర్, ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారని విమర్శించారు. చదువుకున్నా పేదింటి పిల్లలు కూడా కులవృత్తులు చేసుకోవాలా అని ప్రశ్నించారు. ధరణి పేరుతో సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. అదేం లేదని దాటవేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మొదటగా ధరణి సైట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప.. కేసీఆర్ ఇచ్చిందేమీ లేదని వ్యాఖ్యానించారు. వృధ్యప్య పెన్షన్‌లు కూడా ఇవ్వలేదన్నారు.

Harish Rao: దేశం మార్పు కోసమే కేసీఆర్ పోరాడుతున్నారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకం కూడా రూ.5 లక్షల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే.. రూ.500 గ్యాస్ సిలెండర్ ఇచ్చే భాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నారు. 2024 కొత్త సంవత్సరం నాడు పోడు భూములుతో పాటు ధరణి పోర్టల్ రద్దు చేస్తామని మాటిచ్చారు.

Delhi High Court: భర్తపై భార్య వేధింపులు.. విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు