Revanth reddy: తలసానికి అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా అన్నాడు. టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేడ పిసికే అలవాటున్న తలసానికి పిసుకుడు గురించే మాట్లాడుతారని ఎద్దేవ చేశారు. పిసుకుడు సంగతి దేవుడెరుగు.. అతను నమిలే పాన్ పరాక్ మానేస్తే బాగుంటుందని వ్యంగాస్త్రం వేశారు. అరతిపళ్ల బండిదగ్గర మేక నమిలినట్లు పాన్ పరాక్ లు నమిలే వారు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అంతగా కోరిక ఉంటే.. ఏం పిసకాలనుకుంటున్నారో, ఎక్కడకు రావాలో తారీఖు చెబితే వస్తా అన్నారు. ఎవరేం పిసుకుతారో చూద్దామన్నారు. కేసీఆర్ కాళ్లు పిసకడం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డిని పిసకడం అంటే అంటూ రేవంత్ మండిపడ్డారు. మంత్రిగా మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. నేను పీసీసీసీ అధ్యక్షుడిని అని గుర్తు చేశారు. తలసాని జీవితాంతం కేసీఆర్ కాళ్లు పిసికినా నా స్థాయికి రాలేరని రేవంత్ తలసానికి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Read also: Bhatti Vikramarka: రిటైరైన సోమేష్ కుమార్ కు మళ్లీ పదవి ఏంటి ?
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. ఇన్ని రోజులు ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని ఇప్పుడు ఒక్కసారిగా మండిపడ్డారు. ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పిస్తున్న పలువురు నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. ఏమాత్రం ఎవరిని వదలకుండా మాటలతో తీసిపడేశారు. బీజేపీ నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గతంలో ఎన్నడూ లేనంతగా శివాలెత్తి పోయారు. కాగా.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయంపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. పలువురు నేతలు తలసానిని వ్యక్తిగతంగా కూడా విమర్శిస్తూ.. మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తలసాని ఫైర్ అయ్యారు. “రేవంత్ రెడ్డి నోరు మెదపని.. నోరు లేని.. ఎమ్మెల్యేలను, మంత్రులను వదిలేస్తున్నాడు.. ఉన్నదంతా… పిచ్చోడి చేస్తే ప్రాణం పోతుంది.. నిన్న ప్రియాంక గాంధీ దీనిపై మాట్లాడుతూ.. సభలో సంక్షిప్త ప్రకటన.” రేవంత్ రెడ్డిపై తలసాని తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు.
Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లు.. తలసానికి భట్టి సవాల్
