Kotha Prabhakar: తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిన్న కొత్త ప్రభాకర్ పై రాజు అనే వ్యక్తి చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి డాక్టర్లు సుమారు నాలుగు గంటల పాటు కష్టపడి సర్జరీ చేశారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు యశోదా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోదా హస్పటల్ వైద్యులు పేర్కొన్నారు. రక్తం కడుపులో పేరుకుపోయిందని వారు తెలిపారు. ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో సర్జరీ చేయడం ఆలస్యం అయ్యిందని డాక్టర్ల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరో పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.
అయితే ఈరోజు యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. నాలుగు గంటల ఆపరేషన్ అనంతరం.. పోస్ట్ ఆపరేటివ్ కోసం.. ICU కి షిఫ్ట్ చేసామన్నారు. బీపీ సాధారణంగా మెయింటైన్ అవుతుందన్నారు. ఇప్పుడే ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పడానికి లేదని అన్నారు. అందుకే ICU లోనే ఇంకో నాలుగు రోజులు ట్రీట్మెంట్ కొనసాగిస్తామన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం స్టేబులు గా ఉందని డాక్టర్ ప్రసాద్ బాబు తెలిపారు. అన్ని వైటల్స్ నార్మల్ గా ఉన్నాయన్నారు. కన్సియస్ గా ఉన్నారని, రికవరీ ప్రాసెస్ గురించి ఆయనకి వివరించామన్నారు. యాంటీ బయోటిక్స్ ఇస్తున్నామని తెలిపారు. వారం పాటు రెస్ట్ అయితే అవసరం ఉందని అన్నారు. ఇన్ఫెక్షన్ తాలూకు లక్షణాలు ఉన్నాయన్నారు. అందుకే ప్రతిరోజూ అబ్జర్వేషన్ లో ఉంచామన్నారు. పదిహేను రోజులు తరువాత స్టిచ్చేస్ తీస్తామని తెలిపారు. ఇది మేజర్ సర్జరీ గానే చెప్పొచ్చన్నారు. రికవరీకి కొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. చిన్న గాటు లాగే ఉంటుంది.. కానీ లోపల పేగుల దగ్గర పెద్ద కత్తి పోటు కాబట్టి కొంత సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
Chinta Mohan: చంద్రబాబుకు బెయిల్ సంతోషకరం.. మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దు..!