Site icon NTV Telugu

Tragedy in Rajendranagar: తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వత్తిడి.. యువకుడి ఆత్మహత్యాయత్నం

Rajendranar

Rajendranar

రంగారెడ్డి జిల్లా ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టిస్తోంది. రాకేష్‌ అనే యవకుడు తనతో తెచ్చుకున్న కత్తితో రెండు చేతుల మణికట్టు కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గమనించిన పోలీసులు రాకేష్‌ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్ పాండు రంగ నగర్ కు చెందిన ఓ వివాహిత తో గత కొంత కాలంగా రాకేష్ అక్ర సంబంధం కొనిసాగిస్తున్నాడు. భర్త తో దూరంగా ఉంటూ రాకేష్ తో ఆమహిళ వివాహేతర సంబంధం కొనసాగించింది. తనను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి విడతల వారిగా ఆమె వద్దనుంచి రాకేష్‌ 90 వేల రూపాయలు వసూలు చేసుకున్నాడు.

read also: Common Wealth Games 2022: నేటి నుంచి ఆటలు ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే..!!

అక్రమ సంబంధ విషయం వివాహిత కుటుంబసభ్యులకు తెలిసింది. ఇద్దరినీ పిలిపించి మందలించారు కుటుంబ సభ్యులు. వివాహిత వద్ద రాకేష్‌ తీసుకున్న 90 వేల రూపాయలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసారు. దానికి సబంధించిన డబ్బులు నెల రోజుల్లో చెల్లించాలని రాకేష్‌తో బాండ్ పేపర్ పై కుటుంబ సభ్యులు సంతకం తీసుకున్నారు. ఈనేపథ్యంలో నగదును రాకేష్‌ తిరిగి చెల్లించలేక పోయాడు. దీంతో వివాహిత కుటుంబం నుంచి ఒత్తిల్లు ఎక్కువయ్యాయి. నగదు చెల్లించాలని రాకేష్‌ కు ఒత్తిడి చేసారు. లేదంటే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రాకేష్‌ రాజేంద్రనగర్‌ పోలీస్టేషన్‌ ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడని రాకేష్‌ అక్క ఆరోపించింది. దీంతో కేసునమోదు చేసుకున్న రాజేంద్ర నగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Common Wealth Games 2022: నేటి నుంచి ఆటలు ప్రారంభం.. భారత్ షెడ్యూల్ ఇదే..!!

Exit mobile version