Site icon NTV Telugu

My Home Sayuk : మైహోం పరంపర.. సింగిల్‌ డే 1,125 ఫ్లాట్స్‌ సేల్‌..

Sayuk

Sayuk

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో తనదైన ముద్రతో సాగుతోన్న మైహోం గ్రూప్‌ ఫ్రాంచేజీ నుంచి వచ్చిన మైహోం సయూక్‌ ప్రాజెక్ట్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్‌ ఎస్టే్‌ట్‌ రంగంలో తన పరంపర కొనసాగిస్తున్న.. మైహోం ఇటీవల రియల్‌ రాజ్యంలోకి సయూక్‌ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. అయితే.. ఈ సయూక్‌ ప్రాజెక్టులో మునుపెన్నడూ లేనివిధంగా బుకింగ్స్‌ జరిగాయి. అయితే.. తాజాగా సయూక్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి అమ్మకాలు ప్రారంభం కావడంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే 1,125 ప్లాట్స్‌ బుకింగ్స్ కావడం విశేషం. అయితే ఈ బుకింగ్స్‌ విలువ రూ.1800 కోట‍్లు ఉంటుందని తెలిపింది మైహోం సంస్థ.

ఇదిలా ఉంటే.. రికార్డులు సృష్టించడం వాటిని తిరగరాయడం మైంహోంకు కొత్తేమి కాదు. 2016లో ఈ గ్రూపు నుంచి మైహోం అవతార్‌ ప్రాజెక్టును ప్రారంభిచగా.. ఆ రోజుల్లో కేవలం 24 గంటల్లోనే వెయ్యికి పైగా ప్లాట్స్‌ బుక్‌ అవడం రికార్డుగా నిలిచింది. గడిచిన ఆరేళ్లుగా ఇదే సింగిల్‌ డే హయ్యస్ట్‌ బుకింగ్స్‌ రికార్డుగా కొనసాగుతోంది. తాజాగా సయూక్‌ 1,125 బుక్సింగ్స్‌తో అవతార్‌ను అధిగమించింది. రియల్‌ ఎస్టేట్‌ రాజ్యంలో తాను నెలకొల్పిన రికార్డులను తానే బ్రేక్‌ చేసి మైహోం మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది.

Exit mobile version