Site icon NTV Telugu

Firing in Madhapur : భాగ్యనగరంలో కాల్పుల కలకలం..ఒకరు మృతి

Firing In Madhapur

Firing In Madhapur

హైదరాబాదాలో కాల్పుల కలకలం రేపింది. ఈ కాల్పుల్లో రియల్ ఎస్టేట్‌ వ్యాపారి మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాయి.. ఈ ఘటన నగరంలోని మాధాపూర్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని నీరూప్‌ వద్ద సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం తెల్లవారు మూడు గంటల సమయంలో ముజీబ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో పోలీసులు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి బుల్లెట్‌ ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కాలాపత్తర్‌ కు చెందిన రౌడీషీటర్‌ ఇస్మాయిల్‌ గా గుర్తించారు. ఇస్మాయిల్‌ పై కాల్పులు జరిపింది ముజాహిద్‌ గా గుర్తించారు.

read also: Laal Singh Chaddha: కొత్త చిక్కుల్లో సినిమా.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

అయితే కాల్పులు జరిపిన నిందితులు బైక్‌ పై వచ్చి కారులో ఉన్న ఇస్మాయిల్‌ పై పాయింట్‌ బ్లాంక్‌ లో ఆరు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొన్నారు. నిందితున్ని పట్టుకునేందుకు గాలించర్చలు చేపట్టారు. నీరూప్‌ వద్ద (సంఘటనా స్థలం)లో క్లూస్‌ టీంతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. కాల్పులకు గల కారణం రియల్‌ ఎస్టేట్‌ వివాదాలే అని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతి చెంఇన ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయాలైన మరొక వ్యక్తిని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే.. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version