Site icon NTV Telugu

Etela Rajender: హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దం.. ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా!

Harish Rao, Etala Rajender

Harish Rao, Etala Rajender

Ready for open discussion with Harish Rao- Etela Rajender: ఆర్థిక పరిస్థితి పై హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్దమని, ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తా అని ఈటెల సవాల్‌ విసిరారు. ప్రజల డబ్బుతోనే ఓట్లు కొనే నీచ సంస్కృతికి కేసీఆర్‌ దిగజారాడని ఆరోపించారు. 2021 22 ఆర్థిక సంవత్సరం కి 36 వేల కోట్లు వడ్డీ కడుతుందని అన్నారు. బడ్జెట్ రూప కల్పనలు అన్ని తప్పులున్నాయని అన్నారు. నీతి అయోగ్ సిఫార్సులు మాత్రమే చేస్తుంది. కానీ నీతి అయోగ్ చెప్పిందని ఆ డబ్బులు వస్తాయని బడ్జెట్ లో పెట్టిందని, కేంద్రాన్ని బద్నాం చేయడం తప్ప ఇది మరొకటి కాదని ఈటెల మండిపడ్డారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేస్తేనే డబ్బులు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. Gsdp ప్రకారం ఎంత అప్పు వస్తుందో అంత కన్న ఎక్కువ బడ్జెట్ లో పెట్టిందని అన్నారు. GSDP లో తెలంగాణ అప్పు 27.2 శాతం అని, FRBM పరిమితికి మించి అప్పు చేశారని తెలిపారు. లిక్కర్ ద్వారా ఈ ప్రభుత్వంకి 45 వేల కోట్ల అంచనా అన్నారు ఈటెల రాజేందర్‌. తెలంగాణకు వచ్చే సొంత ఆదాయం లో లిక్కర్ ద్వారానే ఎక్కువ అని ఆరోపించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు తెలంగాణ ప్రభుత్వం తన వాటాను సకాలంలో కట్టక పోవడంతో లాప్స్ అవుతున్నాయని మండిపడ్డారు.

Read also: Etela Rajender: కవితకు కౌంటర్‌.. CPI, CPM లు కేసీఆర్‌ వదిలిన బాణాలా?

కేసీఆర్‌ వైఫల్యమే కారణం దీనికి కారణమని అన్నారు. ఇతర రాష్ట్రాలకు కేంద్రం సహకారం ఎలా ఉంటుందో తెలంగాణ కూడా అలానే చేస్తుందని ఈటెల అన్నారు. బట్ట కాల్చి మీద వేయడం కరెక్ట్ కాదని ఈటెల పేర్కొన్నారు. కేసీఆర్‌ డబ్బులు పంచే పని పెట్టుకున్నాడని, ఇదేమి గొప్ప కాదని సంక్షేమం ఉండాలని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్‌ ఇచ్చారు. కవిత చేసిన ట్వీట్‌ కు ఎమ్మల్యే ఈటెల స్పందించారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేసిన కవిత పై ఈటెల మండిపడ్డారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? అనేది పక్కన పెడితే ఆమెది ఒక పార్టీ అని అన్నారు. కవితకు ఇచ్చిన ట్వీట్‌కు CPI, CPM లు కేసీఆర్‌ వదిలిన బాణాలా? అంటూ ప్రశ్నించారు ఈటెల. ప్రజా స్వామ్యం లో నిరసనలు అన్ని పార్టీలు చేస్తాయని, ప్రభుత్వం అధ్వాన్నం గా దుర్మార్గం గా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇది ఎవరు చేసిన ఖండించల్సిందే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలీస్ లను నమ్ముకున్న ఎవరు ముందు పడరని అన్నారు.
Vikram Kirloskar: భారత్‌కు టయోటా తెచ్చిన విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం

Exit mobile version