Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ration Card E-KYC: బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బోగస్ కార్డుల సృష్టికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు దగ్గరపడుతోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రం ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులు అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రకటించినా.. మళ్లీ తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డ్ ఇ-కెవైసి ఇంకా పూర్తి చేయని వారికి ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించారు. దీంతో గడుపు తేదీ దగ్గర పడుతుండటంతో అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు. మూడురోజుల్లో ఈ-కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.
Read also: TS Inter Exams: ఇంటర్ విద్యార్థులు అలర్ట్.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్‌తో స్పెషల్ మీట్
- Hyderabad Pan Masala Raid: హైదరాబాద్‌లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
తెలంగాణలో 75.76 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇంకా e-KYCని పూర్తి చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
Read also: Telangana Weather: కూల్ కూల్ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..
ఇ-కెవైసి ఎలా చేసుకోవాలి?
రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్ మరియు వేలిముద్రలు ఇవ్వాలి. ఇది మీ రేషన్ కార్డ్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇ-కెవైసిని పూర్తి చేసినట్లు ఇపిఒఎస్ మిషన్ నుండి చిన్న రసీదు కూడా అందుకుంటారు. ఈ ప్రక్రియ చాలా సులభం. తెలంగాణలోని రేషన్ కార్డ్ హోల్డర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ రేషన్ షాపుకైనా వెళ్లి ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా e-KYCని పూర్తి చేయవచ్చు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!