Rapido Driver: పొద్దున్నే లేవగానే పిల్లల చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఒకరినొకరు మాట్లాడుకునే రోజులు పోయి.. పిల్లలు, పెద్దలు అర్థరాత్రి వరకు ఆ సెల్ ఫోన్ మాయా ప్రపంచంలోనే గడిపేస్తున్నారు. ముఖ్యంగా యువత ఇందులో చేరిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు సహాయం చేయకుండా ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. అంతే కాకుండా వయసుకు మించి ఫోన్ చేసి వ్యవహారాలు సెటిల్ చేసుకుంటున్నారు. 18 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలు, అబ్బాయిలు గంటల తరబడి సెల్ ఫోన్ లలో మాట్లాడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో.. కోపంతో ఇల్లు వదిలి వెళ్లిపో సమాజం వచ్చింది. అలా ఇల్లు వదిలి వెళ్లిన చాలా మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. అయితే ఇలాంటి వారిపై కన్నేసిన కామాంధులు వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ తరహా ఘటన సికింద్రాబాద్‌లో వెలుగు చూసింది.
Read also: KTR: మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్..
సికింద్రాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయింది. బయటకు వెళ్లిన తర్వాత.. ఆమెకు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆమె వివరాలు తెలుసుకున్న సందీప్.. ఇదే అలుసుగా తీసున్నాడు. ఆమెకు మాయ మాటలు చెప్పాడు. రోడ్డుపై వెళ్లడం మంచిది కాదని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అతడి దురుద్దేశం తెలియని యువతి ర్యాపిడో డ్రైవర్ సందీప్‌తో కలిసి లాడ్జికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత సందీప్ ఆమెపై అత్యాచారం చేశాడు.
ఆమె ఏడుస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు కేసులు నమోదుచేశారు. ఇటీవలి కాలంలో రాపిడో, ఉబర్ డ్రైవర్లు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఆటోలు, బైక్‌లు, క్యాబ్‌లలో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
Uttarpradesh : ప్రియుడి కోసం కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చిన యువతి.. ఈ తర్వాత