NTV Telugu Site icon

SBI ATM Robbery: రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీపై కొనసాగుతున్న దర్యాప్తు..

Atm

Atm

SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత భద్రత వ్యవస్థలు ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేస్తున్నారు.. ఏటీఎంలో చోరీ అనంతరం ముంబై వైపు వెళ్ళినట్లు అనుమానిస్తున్నారు. మార్చ్ ఒకటిన కర్ణాటకలోని హోస్‌కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు తెలుస్తుంది. రావిరాలలో దోపిడీ ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి 30 లక్షల రూపాయలు చోరీ చేసినట్లు సమాచారం వచ్చింది. కర్ణాటక చోరీలో ఏపీ నెంబర్ ప్లేట్ వినియోగించిన దుండగులు.. రావిర్యాలలోని ఏటీఎం, కర్ణాటకలోని ఏటీఎంలో ఒకే తరహా దోపిడి విధానం పాటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కర్ణాటక పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు రాచకొండ పోలీసులు.

Read Also: Nara Lokesh: మార్చిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే భాధ్యత మాది!

కాగా, హైదరాబాద్ శివారు ప్రాంతంలో వరస ఏటీఎంల చోరీకి పాల్పడుతున్నారు. శనివారం రాత్రి రెండు ప్రాంతాలలో ఏటీఎంలో చోరీకి పాల్పడిన ముఠాలు.. రావిర్యాల గ్రామంలో గ్యాస్ కట్టర్ సహాయంతో నాలుగు నిమిషాల్లో చోరీ చేసిన దొంగలు.. సుమారు 30 లక్షల రూపాయల నగదుతో ఉడాయించారు. అలాగే, అదే రోజు రాత్రి మైలార్‌ దేవులపల్లిలోని మధుబన్ కాలనీలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు. ఏటీఎం మెషిన్ ఓపెన్ కాకపోవడంతో ఏటీఎం మిషన్ ని తగలబెట్టారు. వరుస చోరీలతో ఏటీఎం సెంటర్లలో భద్రత కరువైంది.