రంగారెడ్డి జిల్లా ఆమనగల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ… తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఒక లక్ష నలభై వేల అప్పు చేశాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వడం జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ పేదరికాన్ని నిర్మూలించాలని భూ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మరోవైపు.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఆయన చెప్పారు.
Read Also: Rahul Gandhi: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైపోయింది..
భారతదేశంలో నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచి ప్రజలకు మోసం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరు గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు చదువు కోసం 5లక్షలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం లాగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఖర్గే అన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అనేక హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తా అన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంటులలో 15లక్షల రూపాయల వేస్తానని అన్నారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రజలలో ఉండకుండా ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు.
Naresh: అరుదైన గౌరవం అందుకున్న నరేష్.. దేశంలోనే మొదటి వ్యక్తి