Site icon NTV Telugu

Hyderabad: చాయ్ పెట్టనందుకు కోడలును చంపేసిన అత్తా..

Hyd

Hyd

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలోని హసన్ నగర్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంట్లో ఉరేసుకొని చనిపోయిన వివాహితను చున్నీతో ఉరి వేసి ఆమె అత్త హత్య చేసినట్లుగా మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా.. వరకట్న వేధింపులా? కుటుంబ కలహాలా అనే విషయంపై దర్యాప్తు చేశారు. అయితే, పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read Also: Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్

అయితే, సంగారెడ్డికి చెందిన పర్వీనా బేగమ్ అనే కోడల్నీ అత్తా అజ్మీరా బేగం చాయ్ పెట్టనందుకు చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక, 10 ఏళ్ల క్రితం అబ్బాస్ (ఆటో డ్రైవర్) తో పెళ్లి జరిగింది.. వీరికి ఇద్దరు బాబులు కూడా ఉన్నారు.. గత కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నట్లు కూడా పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో కోడలుపై కక్షగట్టిన అత్తా కోడల్ని హత మార్చినట్లు ఒప్పుకుంది. చున్నీతో కోడలి గొంతూ బిగించి చంపినట్లు తెలిపింది. వివాహిత పర్వీనా బేగంను అత్త హత్య చేసిడంతో మృతురాలు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

Exit mobile version