Shad Nagar Cas: మేము దళితులమే మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు.. ప్రతి పైసా కూడా పెట్టి పెళ్లి కోసమని దాచుకున్న 24 తులాల బంగారం రెండు లక్షల నగదు దోచుకుని సునీత నటిస్తుందని బాధితులు వాపోయారు. ఈరోజు మా దొంగతనం కేసును రాజకీయంగా మార్చి.. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన నాయకులకు తండ్రి లేని పిల్లలం మా గోస కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ హరిజనవాడకు చెందిన బంగారం, నగదు దొంగతనం జరిగిన ఇంటి బాధితులు హుబ్బని నాగేందర్, అతని భార్య నీలవేణి, బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు, సోదరి రేణుక వాపోయారు. బాధితుడు నాగేందర్ కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఇంట్లో గత నెల 24వ తేదీన బంగారం చోరీ జరిగిందని చెప్పారు. తను కంది వనంలో ఓ ఆర్ ఎం పి వైద్యుడిగా పనిచేస్తున్నట్టు చెప్పారు తన భార్య నీలవేణి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుందని అదేవిధంగా తన సోదరి రేణుక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగా పని చేస్తున్నట్టు చెప్పారు.
Read also: We Hub: వీ హబ్ లో భారీ పెట్టుబడులు.. స్టార్టప్ లలో మరో రూ.839 కోట్లు..
పైసా పైసా కూడబెట్టి తన చెల్లి రేణుక పెళ్లి కోసం 24 తులాల బంగారం కూడబెట్టానని చెప్పారు. 24వ తేదీ తాము తమ ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళగా తమ పిల్లలు పాఠశాలకు వెళ్లిపోయారని చెప్పారు. పిల్లలు వచ్చేసరికి ఇంటి లోపల నుండి గడియ పెట్టి ఉందని పిల్లలు వెనుక భాగం నుండి వచ్చి చూడగా ఇంట్లో తలుపులు తెరిచి ఉన్నాయని బీరువా తలుపులు కూడా తెరిచి వస్తువులు చిందరవందరగా పడ్డాయని పేర్కొన్నారు. ఈ విషయమై ఉద్యోగాల నుండి వచ్చిన తాము షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. డిటెక్టివ్ సిఐ రాంరెడ్డి తమ కేసు తీసుకున్నారని చెప్పారు. రౌడీ షీటర్ల గురించి మాట్లాడిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సునీత కుటుంబంలో నేర చరిత్ర గురించి కూడా ఒకసారి తెలుసుకోని మాట్లాడాలని కోరారు. సునీత కుటుంబంలో ఎవరెవరిపై కేసులు ఉన్నాయి? సునీత భర్త భీమయ్య స్థానిక పోలీస్ స్టేషన్లోనే రౌడీషీటర్ గా ఉన్న విషయం బీఆర్ఎస్ నాయకులకు తెలియదా అని వారు ప్రశ్నించారు.
Read also: Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే ఛాన్స్: అమెరికా
ఏం జరిగిందంటే..?
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తర్వాత పోలీసు బాధితురాలుగా చెప్పుకుంటున్న సునీత తమ ఇంటి ముందు గల్లీలో ఇంటి గడపపై కొన్ని బంగారు వస్తువులు పెట్టిందని ఇది తమ సోదరి రేణుక కళ్ళారా చూసిందని చెప్పారు. ఆ కవర్లో ఏముందని చూడగా తమకు సంబంధించిన కొన్ని వస్తువులు కనిపించాయని బాధితుడు నాగేందర్ చెప్పారు. అదేవిధంగా ఈ వస్తువులు నీకెలా వచ్చాయని సునీతను నిలదీయగా ఆమె కాలనీలో ఉన్న మల్లేశ్వరికి మిగతా సొమ్ములు ఇచ్చినట్టు చెప్పడంతో పోలీసులు సునితను, మల్లీశ్వరిని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారని చెప్పారు. ఆ తర్వాత అవే వస్తువులను మళ్లీ శ్రీరామ జ్యువెలర్స్ లో తాకట్టు పెట్టినట్టు చెప్పారని ఆ షాపుకు కూడా వెళ్లి చూశామని అక్కడ కూడా అబద్ధాలు చెప్పిందని చెప్పారు. ఆ తరువాత తిరుమలాపూర్లో ఉన్న సునీత సోదరుడుకు బంగారు వస్తువులు ఇచ్చినట్టు పోలీసులకు తప్పుడు సమాచారం సునీత పదేపదే ఇచ్చిందని చెప్పారు. ఇదే అనుమానంపై పోలీసులు సున్నితను ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని చెప్పారు. ఏళ్ల తరబడి కూడబెట్టిన డబ్బుతో పెళ్లి కోసం నగదు కొన్నామని తెలిపారు. ఈ ఆషాడం ముగియగానే పెళ్లి సంబంధం కుదిరిందని త్వరలోనే తమ ఇంట్లో వివాహం జరగబోతుందని ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని రేణుక ప్రశించింది.
Double Ismart: జెట్ స్పీడ్ లో డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?