Site icon NTV Telugu

Ramchander Rao : రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది

Bjp Ramchander Rao

Bjp Ramchander Rao

Ramchander Rao : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామ చందర్ రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి విషయంలో సెంటర్‌పై నెపం వేస్తోంది. అధికారుల కొరతతో పాలనలో శూన్యత నెలకొంది. గ్రూప్ వన్ సమస్యతో సెలెక్ట్ అయినవారూ, కాలేని వారూ బాధపడుతున్నారు” అని అన్నారు.

Tirupati : తిరుపతిలో షాకింగ్ సంఘటన.. మద్యం మత్తులో పాము తల కొరికిన వ్యక్తి

“శ్యామ్ పిట్రోడా ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా రాహుల్ గాంధీ ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఓట్ల చోరీ ఏదీ లేదు. బోగస్ ఓట్లు మాత్రం ఉన్నాయి. బోగస్ ఓట్లు వేరు, ఓట్ల చోరీ వేరు. ఈ తేడా కూడా తెలియని రాహుల్ గాంధీ ఒకసారి ఓట్ల చోరీ అంటారు, ఇంకోసారి హైడ్రోజన్ బాంబ్ అంటారు” అని ఎద్దేవా చేశారు.

అంతేకాకుండా.. “సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం రాసిన లెటర్ ఇప్పటికే సిబిఐ ముందుంది. NDSA ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. అయితే ఆ విచారణలో నిందితులు ఎవరు అన్నది తేల్చారా? విచారణ తర్వాత రాజకీయ నాయకులను ఎవరినైనా అరెస్ట్ చేశారా?” అని ప్రశ్నించారు. “టెర్రరిజం, లెఫ్ట్ టెర్రరిజం రెండూ ఒక్కటే. మావోయిస్ట్‌లతో చర్చలు అనేక సార్లు జరిగాయి. కానీ ఆ చర్చల వల్ల హింస తగ్గలేదు, పెరిగింది. హింస పెరగడం వల్లే ఆపరేషన్ కగార్ ముందుకు వచ్చింది. మావోయిస్ట్‌లతో చర్చలు జరపాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది” అని స్పష్టం చేశారు.

Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్

Exit mobile version