Ramchander Rao : రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది
- రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని ఆరోపణ
- "ఓట్ల చోరీ కాదు.. బోగస్ ఓట్లు ఉన్నాయి" – రామ చందర్ రావు
- కాళేశ్వరం విచారణలో సిబిఐపైనే నమ్మకం ఉందన్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు
- మావోయిస్ట్‌లతో చర్చల కంటే ఆపరేషన్ కగార్‌నే మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రామ చందర్ రావు మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి విషయంలో సెంటర్‌పై నెపం వేస్తోంది. అధికారుల కొరతతో పాలనలో శూన్యత నెలకొంది. గ్రూప్ వన్ సమస్యతో సెలెక్ట్ అయినవారూ, కాలేని వారూ బాధపడుతున్నారు” అని అన్నారు.
Tirupati : తిరుపతిలో షాకింగ్ సంఘటన.. మద్యం మత్తులో పాము తల కొరికిన వ్యక్తి
Also Read
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
“శ్యామ్ పిట్రోడా ఇచ్చిన ట్రైనింగ్ కారణంగా రాహుల్ గాంధీ ఈ స్థితికి వచ్చారు. ఇప్పుడు ‘ఓట్ల చోరీ’ అనే కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఓట్ల చోరీ ఏదీ లేదు. బోగస్ ఓట్లు మాత్రం ఉన్నాయి. బోగస్ ఓట్లు వేరు, ఓట్ల చోరీ వేరు. ఈ తేడా కూడా తెలియని రాహుల్ గాంధీ ఒకసారి ఓట్ల చోరీ అంటారు, ఇంకోసారి హైడ్రోజన్ బాంబ్ అంటారు” అని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా.. “సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం రాసిన లెటర్ ఇప్పటికే సిబిఐ ముందుంది. NDSA ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే పీసీ ఘోష్ విచారణ చేపట్టారు. అయితే ఆ విచారణలో నిందితులు ఎవరు అన్నది తేల్చారా? విచారణ తర్వాత రాజకీయ నాయకులను ఎవరినైనా అరెస్ట్ చేశారా?” అని ప్రశ్నించారు. “టెర్రరిజం, లెఫ్ట్ టెర్రరిజం రెండూ ఒక్కటే. మావోయిస్ట్‌లతో చర్చలు అనేక సార్లు జరిగాయి. కానీ ఆ చర్చల వల్ల హింస తగ్గలేదు, పెరిగింది. హింస పెరగడం వల్లే ఆపరేషన్ కగార్ ముందుకు వచ్చింది. మావోయిస్ట్‌లతో చర్చలు జరపాలా వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది” అని స్పష్టం చేశారు.
Asaduddin Owaisi: ఒవైసీ ఇంటిపై ఈడీ దాడులు ఎందుకు జరగలేదు..? క్లారిటీ ఇచ్చిన ఎంఐఎం చీఫ్
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!