Raja Singh: పద్నాలుగు నెలలు బీజేపీ పార్టీకి దూరంగా ఉన్నానని గోషామాల్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మహాశక్తి దేవాలయాన్ని రాజాసింగ్, బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునావర్ తో కేటిఆర్ హైదరాబాద్ కి తీసుకువస్తే అడ్డుకున్నానని స్పష్టం చేశారు. నా సస్పెన్షన్ ఎత్తివేసినందుకు పార్టీ కి ధన్యవాదాలన్నారు. మహలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని కేసీఆర్ ఫ్యామిలి తరిమెయ్యాలని సంకల్పం తీసుకున్నామని తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ర్ తెలంగాణ ప్రజలని మోసం చేసారని మండిపడ్డారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ చేయలేని బంగారు తెలంగాణ మేము తీసుకువస్తామన్నారు. కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా బండి సంజయ్ గెలిపించాలన్నారు.
దాదాపు ఏడాది తరువాత నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సస్పెషన్ ఎత్తేసి, సీటు కేటాయించడంతో రాజాసింగ్ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు.రాజాసింగ్ మాట్లాడుతూ.. దమ్ముంటే నా మీద అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయాలన్నారు. ఎంఐఎంను పెంచి పోషించింది కాంగ్రెస్ అని ఆయన ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌లు ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘నా నియోజక వర్గం లో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన సపోర్ట్ చేస్తా అని చెప్పిన విక్రమ్ గౌడ్ నాకు ప్రచారం చేస్తారు. నాకు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. నా పైన సస్పెన్షన్ ఎత్తేవేసి నాకు టికెట్ ఇచ్చినందుకు బీజేపీ హై కమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్. పార్టీ ఎక్కడ ప్రచారం చేయమన్న చేస్తానని అన్నారు. తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ గ్రాఫ్ తగ్గిందనే ది ప్రచారం మాత్రమే’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడంపై రాజాసింగ్ ఆనందం వ్యక్తం చేశారు.
Central Team: కాళేశ్వరం డ్యామ్ భద్రతపై కిషన్ రెడ్డి లేఖ.. రేపు తెలంగాణకు కేంద్ర బృందం..