Site icon NTV Telugu

Sircilla: సిరిసిల్ల కలెక్టర్‌పై వ్యాఖ్యలను ఖండించిన అధికారుల సంఘం..

Ktr

Ktr

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది.. అయితే, ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని అధికారుల సంఘం తెలిపారు.

Harish Rao: కేంద్రాన్ని, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారు.. ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంలో తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. సివిల్ సర్వీసు గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేస్తోంది. అందువల్ల, ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని.. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తోంది. కాగా.. రెండు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌ సన్నాహక సమావేశంలో కేటీఆర్ జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కింద వీడియోలో ఉంది.

BJP: ‘‘ఓడిపోతే ఏడుస్తారు.. మరి గెలిస్తే..’’ ఈవీఎంలపై కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్..

Exit mobile version