కలెక్టర్ అంటే జిల్లాకు సుప్రీమ్. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ…. ఏ చిన్నా తేడా వచ్చినా హడలెత్తించిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ఆ జిల్లా పేరు చెబితేనే హడలి పోతున్నారట. కావాలంటే పనిష్మెంట్ కింద లూప్‌లైన్‌లో వేయండిగానీ… ఆ జిల్లాకు మాత్రం కలెక్టర్‌గా వద్దని అంటున్నారట. ఐఎఎస్‌లనే అల్లల్లాడిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బ్యూరోక్రాట్స్‌లో హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలోనే అతి చిన్నదైన…
సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్‌లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై సిరిసిల్ల శాసనసభ్యులు కె.తారక రామారావు చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.