Site icon NTV Telugu

Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్!

Sarpanch

Sarpanch

Sarpanch as Chimpanzee: గ్రామ సమస్యలకు మాటలతో కాకుండా.. తన చర్యలతో పరిష్కారం చూపించిన సర్పంచ్ ఒకరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. కోతుల బెడదతో అల్లాడుతున్న గ్రామ ప్రజలకు ఊరటనిచ్చేందుకు స్వయంగా సర్పంచ్ చింపాంజీ వేషం వేసి రంగంలోకి దిగాడు.

T20 World Cup 2026: భారత్ డబ్బులపైనే పాకిస్థాన్ క్రికెట్ బతుకుతుంది?.. రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్!

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామానికి చెందిన సర్పంచ్ మద్దుల రాజిరెడ్డి గ్రామంలో కోతుల సమస్యను ఎదుర్కొనేందుకు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలోనే గ్రామ ప్రజలు కోతుల బెడద నుంచి తప్పించాలని కోరగా తాజాగా ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆ హామీని అమలు చేసే దిశగా అడుగు వేశారు. దీనితో తానే స్వయంగా చింపాంజీ వేషం ధరించి గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ కోతులను పరుగులు పెట్టించడంతో గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Dhurandhar 2 Teaser: ఫ్యాన్స్ అసహనం.. ధురంధర్ 2 టీజర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్..

సర్పంచ్ స్థాయిలో ఉండి గ్రామ సమస్యకు ఇలా ప్రత్యక్షంగా స్పందించడం అరుదని పలువురు స్థానికులు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. మాటలు కాదు.. పని చేసి చూపించిన ఈ సర్పంచ్ చర్య ఇప్పుడు నాగంపేట గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version