KTR : జీవో 97పై కేటీఆర్ ఫైర్.. విద్యార్థులకు కీలక హామీ
- జీవో 97 రద్దు చేయాలని డిమాండ్
- విద్యార్థులతో కేటీఆర్ రౌండ్ టేబుల్
- రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
- విద్యార్థుల హక్కుల కోసం పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో సాంకేతిక విద్యకు పెద్దపీట
మల్టీ డిసిప్లినరీ కోర్సులు, అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. “తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కేసీఆర్ గారు అనేక కొత్త కోర్సులను తీసుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు, స్కిల్స్ అభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశాం” అని ఆయన పేర్కొన్నారు.
Also Read
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- KCR: తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం చాకలి ఐలమ్మ..
- Uttam Kumar Reddy: "రిఫరీపైనే అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం".. ఈసీ, బీజేపీపై మంత్రి ఫైర్..
- Hyderabad: హుస్సేన్ సాగర్‌లో కొనసాగుతున్న నిమజ్జనాలు.. ఈ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ!
హామీలను గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. “రూ. 5 లక్షల విద్య భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారు. పదో తరగతి పాసైతే రూ. 10 వేలు, ఇంటర్ విద్యార్థులకు రూ. 15 వేలు ఇస్తామన్న హామీలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల విలువైన భూములను అమ్మేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడతాం
విద్యార్థుల హక్కుల కోసం ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అగ్రహారం కళాశాల అధ్యాపకులు, యాజమాన్యం విద్యార్థులకు అండగా నిలబడాలని కోరారు. ఒకవేళ విద్యార్థులను ఎవరైనా బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులుగానీ, అధికారులుగానీ బెదిరింపులకు పాల్పడితే వెంటనే బీఆర్ఎస్వీ (BRSV) నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. “రెండేళ్లు ఓపిక పట్టండి, మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో మన ప్రభుత్వం వస్తుంది” అని విద్యార్థులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!