Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులకు 70 లక్షల రూపాయల విలువ గల 675 పరికరాలను అందజేయడం సంతోషదాయకంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మనుషులలో కల్మషం లేని వారంటే, వారు కేవలం దివ్యాంగులే.. ఐదు సంవత్సరాలలో సిరిసిల్ల కలెక్టరేట్ కు ఒక్కసారి కూడా రాలేదు.. గతంలో ఎవరైనా కలెక్టర్ పిలిస్తే బదిలీ అయ్యే భయం ఉండేది అన్నారు. అటెండర్ పార్లమెంట్ సభ్యుడు కావొచ్చు.. కానీ, ఎంపీ అటెండర్ కాలేడు అని ఆయన తెలిపారు. ఇక, కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకొని దివ్యాంగులకు కాలనీ కట్టించాలి.. ఇష్టారీతిన మాట్లాడితే సమాజం గుర్తించదు అన్నారు.
Read Also: Minister Uttam: 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు..
అయితే, వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం స్కీం రాకుండా గతంలో అడ్డుకున్నారు అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. నా పదవి ప్రజలు పెట్టిన బిక్ష.. వారి అభివృధ్ధికి మా తోడ్పాటు ఉంటుంది.. అలాగే, ధరణి పేరుతో కొంప ముంచారు.. ఈ ధరణితో ఒక కుటుంబంతో పాటు కొందరే లాభపడ్డారు అని వెల్లడించారు. దళితులకు ఇచ్చిన భూముల్లోనే శ్మశానాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలు కట్టారు.. కబ్జాకు గురైనా భూములు స్వాధీనం చేయడంలో అధికారులు వెనకడుగు వేయొద్దు.. మా సహాకారం ఎల్లప్పుడూ ఉంటుంది అని బండి సంజయ్ తెలిపారు.