నల్గొండ జిల్లా అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కంచుకోట. కోమటిరెడ్డి సోదరులు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్లు.. ఓట్లు రాబట్టడంలో పాపులర్ అయ్యారు. నల్గొండ జిల్లాలో ఉన్న వీదద్దరి పేర్లు చెబితే చాలు వృద్ధులంతా కాంగ్రెస్ వారేనని నమ్ముతారు. అన్నను కాంగ్రెస్ లోనే వదిలేని తమ్మడు మాత్రం కమంలో చేరారు. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. అన్న కాంగ్రెస్.. తమ్మడు బీజేపీ అని మాత్రం మునుగోడులో వున్న వృద్ధులకు, పెద్దలకు, అక్కడున్న ప్రజాలకు ఇంకా మైండ్ లో రిజిస్ట్రర్ కాలేదనే చెప్పాలి. అలా కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ అని ఫిక్స్ అయ్యారు మునుగోడు ప్రజలు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిన విషయం ఎవ్వరికీ ఇంకా తెలియదు అక్కడున్న వారంతా రాజగోపాల్ కాంగ్రెస్ అనే గట్టిగా నమ్ముతున్నారు.
అయితే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ నేతలు తలపట్టుకోవాల్సిన పరిస్ధితి వస్తోంది. మునుగోడులో కాషాయం విసృత ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీ శ్రేణులు మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి గుర్తు ఏంటో తెలుసా అని అడిగితే హా.. ఎందుకు తెలియదు చేయి గుర్తు కదా(హస్తం) అంటున్నారట. దీంతో బీజేపీ శ్రేణులు షాక్ లో వున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉంటూ ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ను హస్తం గుర్తుపైనే ఓటేసి గెలిపించి పంపించిన ప్రజలకు కోమటిరెట్టి అంటే హస్తం అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి మునుగోడులో ప్రచారం చేస్తుంటే ఎటు ఓటు వేస్తావ్ తాతా అంటే కోమటిరెడ్డికే నాకేందుకు తెలియదు హస్తం గుర్తే కదా అంటున్నరు ఇదివిన్న బీజేపీ నేతలు తలపట్టుకునే పరిస్థితి.
రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినా ఇంతకు ముందు ఆ స్థాయిలో సందడి లేదు. వృద్ధ స్త్రీల గురించి ప్రజలకు తెలియదు. అందుకే కోమటిరెడ్డిపై ఉన్న అభిమానం కాంగ్రెస్‌కు ఓటుగా మారుతుందా? అన్న భయం బీజేపీ నాయకత్వాన్ని వెంటాడుతోంది. ఇదే జరిగితే పేరేమో కోమటిరెడ్డిది.. గెలిచేదేమో.. కాంగ్రెస్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అలా జరిగితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కాంగ్రెస్ ను గెలిపించిన వారే అవుతారు. మరి బీజేపీ సంగతేంటి? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి.
Vishaka Garjana: మూడురాజధానులు కావాల్సిందే… గళమెత్తిన జనం