NTV Telugu Site icon

Laxmi Rajagopal: అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలి

Rg Reddy

Rg Reddy

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగాచౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంలో,రెడ్డిబావి గుండ్ల బావి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి సుడిగాలి ప్రచారం చేశారు. ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ బిజెపిని గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామస్థులు బతుకమ్మలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. మునుగోడు ఉప ఎన్నికల్లో న్యాయాన్ని గెలిపిస్తారా అధర్మాన్ని గెలిపిస్తారన్నారు. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందని కుటుంబ పాలన వల్ల రాష్ట్రంలో ఇంత మంది ఇబ్బందుల గురవుతున్నారన్నారు. ఈ అరాచక పాలన పోవాలంటే రాజగోపాల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె అన్నారు.

Read Also: Kiran Abbavaram: శివరాత్రికి విష్ణుకథ వినిపించనున్న అల్లు అరవింద్!

అంతేకాక సొంతనిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డిదే అన్నారు. ప్రతి ఒక్కరికి అండదండగా ఉన్నది రాజగోపాల్ రెడ్డి అన్నారు లక్ష్మీ రాజగోపాల్. ప్రతిపక్షంలో ఉండి ఈ ప్రాంత ప్రజల కోసం పోరాడిన ఫలితం దక్కలేదు. అందుకే రాజీనామా చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధి నోచుకోకుండా అడ్డుకున్న ఈ ప్రభుత్వానికి గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు. తన పదవిని కూడా త్యాగం చేసి ఉప ఎన్నిక ద్వారా మీ ముందుకు వచ్చారు రాజగోపాల్ రెడ్డి. రాజీనామా చేయడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద నియోజకవర్గంలో మంత్రులను దింపిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో చిన్న గ్రామానికి ఇన్చార్జిగా రావడం విడ్డూరంగా వుందన్నారు. బిజెపి పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీకి భయం చుట్టుకున్నది అందుకనే మంత్రులను ఎమ్మెల్యేని మోహరించి టిఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుండు కానీ మునుగోడు ప్రజలు చైతన్యవంతులు బిజెపికే ఓటు వేసి గెలిపిస్తారు.. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారే తప్ప మిగతా ప్రాంతాలపై వివక్ష ఎందుకు చూపుతున్నారని. ప్రాంతాల మధ్య వివక్ష చూపించి అభివృద్ధికి అడ్డుపడుతుంది టిఆర్ఎస్ పార్టీని ఈ.మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలుఓడించి తగిన బుద్ధి చెప్పాలని లక్ష్మీ రాజగోపాల్ కోరారు.

Read Also: Earthquake: గడ్చిరోలి కేంద్రంగా తెలంగాణ సరిహద్దుల్లో భూకంపం