Komatireddy Rajgopal Reddy : యాదాద్రి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడి చర్చలకు దారితీశాయి. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డి, “గతంలో నా రాజీనామా వల్ల మునుగోడు నియోజకవర్గానికి మేలు జరిగిందని నాకు గర్వంగా ఉంది. నాకు మంత్రి పదవి హామీ ఇచ్చిన విషయం నిజమే కానీ, అది ఆలస్యమైనా నేను ఓపికగా ఎదురుచూస్తాను. నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా పర్వాలేదు. కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎంతటి నిర్ణయమైనా తీసుకోవడానికి నేను వెనకాడను” అని స్పష్టం చేశారు.
Alekya chitti sisters : అవి బాగుండాలంటూ నీచంగా మాట్లాడారు.. రమ్య మోక్ష ఎమోషనల్
అలాగే, “రాజగోపాల్ రెడ్డిని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. ట్రిపుల్ ఆర్ రైతుల సమస్యలు పరిష్కారమవ్వాలంటే ప్రభుత్వం కదలాల్సిందే. అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. రైతుల కోసం నేను ఎంతటి త్యాగమైనా చేయడానికి వెనకాడను. ట్రిపుల్ ఆర్ రైతులకు న్యాయం జరిగేంతవరకు వారితోనే ఉంటాను” అని ఆయన హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల్లో కొత్త ఆశలు వెల్లివిరిసినట్లు కనిపించింది. మరోవైపు, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
Vani Inspiring Story: ‘నీ వల్ల కాదు’.. అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నా..
