Komatireddy Rajgopal Reddy : రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్..
- నారాయణపురంలో ట్రిపుల్ ఆర్ రైతులతో భేటీ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
- మునుగోడు ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే కఠిన నిర్ణయాలకైనా సిద్ధం
- రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీ వెంటనే ఉంటానని హామీ
- "రాజగోపాల్ రెడ్డిని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు" అని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajgopal Reddy : యాదాద్రి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడి చర్చలకు దారితీశాయి. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డి, “గతంలో నా రాజీనామా వల్ల మునుగోడు నియోజకవర్గానికి మేలు జరిగిందని నాకు గర్వంగా ఉంది. నాకు మంత్రి పదవి హామీ ఇచ్చిన విషయం నిజమే కానీ, అది ఆలస్యమైనా నేను ఓపికగా ఎదురుచూస్తాను. నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా పర్వాలేదు. కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎంతటి నిర్ణయమైనా తీసుకోవడానికి నేను వెనకాడను” అని స్పష్టం చేశారు.
Alekya chitti sisters : అవి బాగుండాలంటూ నీచంగా మాట్లాడారు.. రమ్య మోక్ష ఎమోషనల్
Also Read
అలాగే, “రాజగోపాల్ రెడ్డిని ఎవ్వరూ ప్రభావితం చేయలేరు. ట్రిపుల్ ఆర్ రైతుల సమస్యలు పరిష్కారమవ్వాలంటే ప్రభుత్వం కదలాల్సిందే. అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. రైతుల కోసం నేను ఎంతటి త్యాగమైనా చేయడానికి వెనకాడను. ట్రిపుల్ ఆర్ రైతులకు న్యాయం జరిగేంతవరకు వారితోనే ఉంటాను” అని ఆయన హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో రైతుల్లో కొత్త ఆశలు వెల్లివిరిసినట్లు కనిపించింది. మరోవైపు, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
Vani Inspiring Story: ‘నీ వల్ల కాదు’.. అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..