Vani Inspiring Story: తనకు చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. సెలవులు దొరికితే కొండల్నీ, గుట్టల్నీ ఎక్కుతూ ఉండేది. పది పాస్ అయిన తర్వాత తన జీవితంలో భర్త వచ్చాడు. కొత్త సంసారం.. సరి కొత్త జీవితం.. తన జీవితం సంతోషంగా సాగిపోవడం కాలానికి నచ్చినట్లు లేదు.. పెళ్లి అయిన ఏడేళ్లకు భర్త మరణం.. ఇకపై తను బతుకుతూ కొడుకు జీవితాన్ని చక్కదిద్దాలనే నిర్ణయంతో దు:ఖాన్ని దిగమింగుకొని జీవితంతో పోరాటం చేస్తుడంగా.. ఒక రోజు కొడుకును క్యాన్సర్ కబలించింది. దు:ఖం.. ఇక జీవితం మొత్తం చీకటే… అనుకొని అక్కడే కూర్చోలేదు. ఆ దుఃఖం నుంచి బయటపడటానికి ట్రెక్కింగ్‌ను సాధనంగా చేసుకుంది. ఇటీవల హిమాలయాల్లోని ‘సర్ పాస్’ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది.
READ ALSO: Tank Bund : ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం చేసి వస్తున్న యువత పై పోలీసులు దురుస ప్రవర్తన
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకోడేరుకు చెందిన వాణీకి చిన్నప్పట్నుంచీ ట్రెక్కింగ్ అంటే ఇష్టం. సెలవులు దొరికితే కొండల్నీ, గుట్టల్నీ ఎక్కుతూ ఉండేది. పది పూర్తయ్యాక చినఅమిరం గ్రామానికి చెందిన రామకోటేశ్వరరావుతో ఆమెకు పెళ్లి చేశారు. వివాహమైన ఏడేళ్లకు అనారోగ్యంతో ఆవిడ భర్త చనిపోయారు. అప్పటికే ఆమెకు ఒక బాబు ఉన్నారు. ఇక బాబు భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ… ఎంఏ పూర్తిచేసినట్లు తెలిపారు.
బాబు చదువుకోసం చెన్నైకి..
బాబు చదువుకోసం చెన్నై వెళ్లామని వాణి చెప్పారు. వయసుతో పాటూ కీళ్ల నొప్పులూ మొదలయ్యాయని, అప్పుడే నడక తన జీవితంలో భాగమైందన్నారు. వీలున్నప్పుడల్లా తిరుపతి కొండపైకి నడిచి వెళ్లేవారని, దీనివల్ల కొద్ది రోజుల్లోనే తన శారీరక సమస్యలు దూరమయ్యాయని చెప్పారు. అప్పుడప్పుడు ట్రిప్పులకూ వెళ్తుండేవారని చెప్పారు. జీవితం సాఫీగా సాగిపోతోంది అనుకునేలోపే… 2018లో తన కొడుకు క్యాన్సర్‌తో చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక జీవితంలో ఒంటరితనం, దుఃఖం ఆవరించడంతో పాటు, సయాటికా సమస్య కూడా మొదలైందన్నారు. తన జీవితం ఇక్కడితో ఆగిపోలేదని వీటన్నింటి నుంచీ బయటపడటానికీ, ధ్యాస మళ్లించుకోవడానికీ మళ్లీ ప్రయాణాల్ని మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు.
ఆమె ప్రయాణం.. మొదలైంది
ఆవిడ ప్రయాణం 2025 మేలో సర్ పాస్ ట్రెక్కింగ్ వైపు మళ్లింది. ‘మొదటిరోజే కష్టమైంది. నొప్పి మాత్రలు వేసుకోకపోతే రేపు ప్రయాణం చేయలేమేమో. వాణీ మీరు ఆగిపోండి. వాతావరణం దారుణంగా ఉంది’ అంటూ సర్ పాస్ ట్రెక్కింగ్‌కి వెళ్లిన తనకు ఎన్ని సలహాలో ఇచ్చారని చెప్పారు 62 ఏళ్ల వాణి. ఈ వయసులో ప్రతికూల వాతావరణంలో ట్రెక్కింగ్ అంటే ఆ మాత్రం అడ్డంకులు, చుట్టూ ఉన్న వాళ్లకి భయాలూ సహజమే అని ఆమె చెప్పారు. కానీ తన పట్టుదలతో అవన్నీ దాటినట్లు చెప్పారు. ‘నీ వల్ల కాదు’… అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నట్లు సగౌరవంగా చెప్పారు.
గతంలో ఆవిడ 2009లో కైలాస్ మానస్ సరోవర్‌కి వెళ్లినట్లు పేర్కొన్నారు. పర్వతం చుట్టూ 57 కిలోమీటర్లు మూడు రోజుల పాటు నడిచాని చెప్పారు. 2010లో గంగోత్రి-యమునోత్రి, 2012లో కేదార్‌నాథ్ వెళ్లాని పేర్కొన్నారు. వీలైనంత వరకూ నడిచి వెళ్లడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అలా 2025లో శేషాచలంలో తుంబర తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసినట్లు చెప్పారు. ఎవరెస్ట్ ఎక్కాలనేదే తన అంతిమ లక్ష్యం అని పేర్కొన్నారు.
నిజంగా ప్రతి మనిషికి జీవితంలో ఎదో ఒక సందర్భంలో కష్టాలు రావడం సహజం. కానీ ఆ వచ్చిన కష్టాలను చూస్తూ అక్కడే ఆగిపోతే జీవితంలో ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. వాస్తవంగా ఆవిడ తన భర్త చనిపోయన నాడు తన బిడ్డా భవిష్యత్తు కోసం లేచి నిలబడింది. తనంత బిడ్డ కళ్ల ముందే క్యాన్సర్‌తో తనువు చాలిస్తే ఆ తల్లి బతకడం ఎంత కష్టమో ఒక సారి ఆలోచించండి. అలాంటి ఆ తల్లి భర్తను, బిడ్డను కోల్పోయి తన 62 ఏళ్ల వయసులో దు:ఖం నుంచి దారి మళ్లించుకోవాలనే తలొంపుతో ట్రెక్కింగ్ వైపు కదిలింది. నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ఎందరో వాళ్లకు వచ్చిన చిన్నచిన్న కష్టాలను చూసే ప్రాణాలు వదిలేస్తున్న రోజుల్లో అలాంటి వారికి గొప్ప పాఠంగా ఈ తల్లి నిలిచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
READ ALSO: Steve Jobs: ‘చివరి క్షణాల్లో తనకే లేఖ రాసుకున్న స్టీవ్ జాబ్స్’.. ఆ లేఖలో ఏముందంటే!