Site icon NTV Telugu

Raja Singh : చంద్రబాబు, పవన్‌లకు రాజాసింగ్ ‘సీక్రెట్ అడ్వైజ్’ ఏంటో తెలుసా.?

Raja Singh

Raja Singh

Raja Singh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక సందేశం పంపారు. రాజాసింగ్ తన నివేదికలో.. “ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారూ, మైనారిటీల కోసం ఎంత కష్టపడినా, మిమ్మల్ని వారు ఓటు వేయరు. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల ముస్లిం ఓట్లు మీకు రాకపోవడం ఖాయం” అని స్పష్టం చేశారు.

IND vs UAE: ఆసియా కప్‌లో నేడే భారత్‌ తొలి పోరు.. పసికూనతో గెలిచేనా..?

అతను పేర్కొంటూ, “ముస్లింలు దేశవ్యాప్తంగా బీజేపీని తమ ప్రధాన శత్రువుగా భావిస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ బిల్లు – ఇవన్నీ బీజేపీ చేసిన ముఖ్యమైన పనులు. దీని కారణంగా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు” అని అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు రాజాసింగ్ సూచిస్తూ, “మీ శక్తినంతా హిందువుల కోసం వినియోగించండి. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలను కాపాడండి, మతమార్పిడులను అరికట్టండి. అలా చేస్తే హిందువులు మిమ్మల్ని మరోసారి అధికారంలోకి తీసుకువస్తారు” అని పిలుపునిచ్చారు.

France: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను నియామకం

Exit mobile version