NTV Telugu Site icon

Rahul Gandhi: అంబటి పల్లిలో మహిళా సదస్సు.. పొల్గొన్న రాహుల్ గాంధీ

Rahul Gandhu Revanth Reddy

Rahul Gandhu Revanth Reddy

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోయిన పిల్లర్లను రాహుల్ గాంధీ పరిశీలించనున్నారు. అంబటి పల్లి మహిళా సదస్సులో రాహుల్ పాల్గొన్నారు. సభ పూర్తి కాగానే మెడిగడ్డకు రాహుల్ బయలు దేరనున్నారు. కల్వకుర్తిలో నిన్న జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ లక్షల ఎకరాలకు నీరందిస్తున్నాయని, అయితే టీఆర్ ఎస్ ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయని విమర్శించారు. ప్రియదర్శిని జూరాల, శ్రీరామ్ సాగర్. నాగార్జునసాగర్, సింగూరు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నిర్మించి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టంగా ఉన్నాయని, లక్షల ఎకరాలకు నీరు అందించి సాగులోకి తీసుకొస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న ప్రజలకు ఆదాయం, పని లభిస్తున్నదని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి మరీ ప్రాజెక్టులు నిర్మించిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి బ్యారేజీ కూలిపోతుందని, దానిపై సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే ఇప్పటి వరకు దానిపై సమీక్ష నిర్వహించలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్‌కు బై బై చెబుతాం.. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)తో పాటు అవినీతి మంత్రులకు మా ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లోకి చేర్చేలా చూస్తాం’’ అని రాహుల్ అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎక్సైజ్, భూ రెవెన్యూ, ఇసుక తవ్వకాల వంటి ఆదాయాన్ని సమకూర్చే శాఖలపై సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం గుత్తాధిపత్యం సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల నుంచి లక్షల కోట్లు దోచి అనతికాలంలోనే శిథిలావస్థకు చేరుకున్న ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజల సొమ్ముతో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టుగా మార్చారని, 2040 వరకు తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏటా రూ.31,500ల భారం పడేలా చేశారని విమర్శించారు.
IT Raids: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఇళ్లలో తనిఖీలు

Show comments