Rahul Gandhi: కొండగట్టు సందర్శన వాయిదా.. నేరుగా ఆర్ముర్ కి రాహుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నేడు నిజామాబాద్‌లో సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. ఇవాళ ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ముఖాముఖీ సమావేశం అవుతారు. అనంతరం బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో షెడ్యూల్ కుదింపు చేశారు అధికారులు. దీంతో కొండగట్టు సందర్శన వాయిదా పడింది. కరీంనగర్ నుండి జగిత్యాలకి నేరుగా వెళ్లనున్నారు. అనంతరం అక్కడే కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్నారు. కోరుట్లలో కార్నర్ మీటింగ్ లో పార్టీ శ్రేణులతో మాట్లాడి అక్కడే మధ్నాహ్న భోజనం చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆర్ముర్ కి రాహుల్ పయనం కానున్నారు. మధ్నాహం 2.30 కి సభలో పాల్గొని మాట్లాడనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్ లో హైదరాబాద్ కి వచ్చి అక్కడనుంచి కమర్షియల్ ఫ్లైట్ లో ఢిల్లీకి రాహుల్ పయనం కానున్నారు.
నేడు రాహుల్ షెడ్యూల్..
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
ఇవాళ ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ లోని వీపార్క్ హోటల్ నుంచి బయలుదేరనున్న రాహుల్ గాంధీ ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర దగ్గర సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాల పట్టణంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతం మధ్యాహ్నం 12గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో సమావేశంలో పాల్గొననున్నారు. కోరుట్లలో మధ్యాహ్నం 1గంటకు కోరుట్ల వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండల కేంద్రం లో కార్యకర్తలకు అభివాదం చేయనున్న రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 1.30 గంటలకు ముక్కస్ కన్వేషన్ లో భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ తలపెట్టిన సభలో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. కాగా ఆర్మూర్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పాటిల్ నేతలు హస్తం గూటికి చేరనున్నారు. ఆర్మూర్ పట్టణంలో రాహుల్ పెద్ద ఎత్తున అభిమానులు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పట్లు చేశారు. రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ట్రాఫిక్ ను మళ్లించారు అధికారులు.
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!