Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత నిర్వహించిన తాజా ప్రెస్‌మీట్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత తన మీడియా సమావేశంలో కొత్తగా చెప్పిన అంశాలేమీ లేవని విమర్శించారు. మరికొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కుమ్మక్కయ్యారని తాను ఇంతకుముందే చెప్పానని రఘునందన్ గుర్తుచేశారు. “బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై నేను మాట్లాడదల్చుకోను. అయితే కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలి” అని అన్నారు.
KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని, హరీష్-రేవంత్ ఒకే ఫ్లైట్‌లో వచ్చారనేది నిజమన్నారు. ఫ్లైట్‌లో వాళ్లు నన్ను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారని, కవిత కొత్త పార్టీ పెడుతుందన్నారు రఘునందన్ రావు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదని ఎంపీ రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు. అలాగే, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై కూడా విచారణ అవసరమని డిమాండ్ చేశారు. గతంలో జడ్పీ అధ్యక్షుడి ఎన్నికల్లో తాను ఎదుర్కొన్న పరిస్థితులను కేసీఆర్‌కు వివరించినా, అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెదక్ ఎంపీ ఎన్నికల్లో తనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినట్టు కూడా గుర్తు చేశారు. “కవిత నేటి ప్రెస్‌మీట్‌తో బీఆర్ఎస్ అవినీతి బహిర్గతమైంది. మళ్లీ వచ్చే ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై మరిన్ని విషయాలు బయటపెడితే బాగుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి” అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌పై కవిత ఆగ్రహం పార్టీ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
