Raghunandan Rao: ఎక్కడ తప్పు మాట్లాడలేదు చట్టం ప్రకారం నడుచుకోవాలని చెప్పామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మియాపూర్ భూముల విషయంలో ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయమా? అని ప్రశ్నించాను అన్నారు. ఈ రోజు తెలంగాణ CS శాంతి కుమారికి బహిరంగంగా ఒక లేఖ రాస్తున్నానని తెలిపారు. కలెక్టర్ 8 ఎకరాల విషయంలో SLP దాఖలు చేశారు. కానీ 40 ఎకరాల విషయంలో SLP వేయలేదన్నారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో SLP వేయాలని, భూమినీ కాపాడాలని CS కు లెటర్ మెయిల్ చేస్తున్నానని అన్నారు.
Read also: TSPSC AEE: ఏఈఈ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. ఆ టైం దాటిందో గేట్లు క్లోజ్
రంగారెడ్డి కలెక్టర్ కు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని, అఖిల భారత సర్వీస్ అధికారికి తాను అనుకున్న ప్లేస్ లోనే పనిచేస్తా అని అనడానికి అవకాశం లేదన్నారు. కేంద్రం ఎక్కడ పని చేయాలని చెబితే అక్కడ పని చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నా ఆయన అధికారుల పై pmo కి, DOPT కి పిర్యాదు చేశానన్నారు. PMO నుండి రిప్లై వచ్చిందని, కొత్త డీజీపీ ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం నీ కోరుతున్నా అన్నారు రఘునందన్ రావు. కేటీఆర్, కెసిఆర్, హరీష్ రావు, తోట చంద్రశేఖర్ ల ఆస్తి నాకు ఏమొద్దు అంటూ ఎద్దేవ చేశారు. CS కార్యాలయానికి రఘునందన్ రావు పోన్ చేశారు. CS అపాయింట్ మెంట్ అడిగారు రఘునందన్ రావు.
Master Plan: ఆందోళన వద్దు మాస్టర్ ప్లాన్ రద్దు చేసాం.. మున్సిపల్ పాలకవర్గాలు తీర్మానం