Site icon NTV Telugu

Puvvada Ajay Kumar: బండి సంజయ్ పై పువ్వాడ ఫైర్.. కంటి వెలుగులో పరీక్ష చేయించుకోమని సెటైర్

Puvvada Ajay Kumar

Puvvada Ajay Kumar

Puvvada Ajay Kumar: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై బీఆర్‌ఎస్‌ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్‌ అయ్యారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఒక వేళ చూపిచేందుకు వెళ్ళలేకపోతే బండి దగ్గరకే మేము ఓ..టీం ను పంపిస్తామని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించే అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నే శత్రువంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ని ఓడించే కార్యాచరణ తీసుకోవడం మాకేం అవసరం లేదన్నారు. వైస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు.. మాకు మేమె శత్రువులమని.. వ్యాఖ్యానించారు.

Read also: Bandi Sanjay: పుట్టినరోజు నాడు సెక్రటేరియట్ ప్రారంభించడం ఏంటి?

నిన్న ఖమ్మంలో జరిగిన బీఅరెస్ ఆవిర్భావ సభ సూపర్ డూపర్ హిట్ అయిందని తెలిపారు. సభకు లక్షల్లో వచ్చారు. ట్రాఫిక్ చిక్కుకొని లక్షల్లో సభ పరిసర ప్రాంతాల్లో ఉన్నారన్నారు. ఖమ్మంలో ప్రజలు18వ తేదీన సంక్రాంతి జరుపుకున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మంకు భారీగా నిధులు ప్రకటించినందుకు కేసీఅర్ కు ధన్యవాదాలన్నారు మంత్రి. కాంగ్రెస్ ను ఓడించడానికి సుపారీ లు అవసరం లేదు.. వాళ్ళ నేతలే చాలన్నారు. సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో కళ్ళ పరీక్ష చేసుకుంటే మంచిది.. లేదంటే మేమే ఓ టీం ను పంపిస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌. బండి సంజయ్ కు 24 గంటల కరెంటు గురించి సందేహాలు ఉంటే ఎక్కడైనా కరెంటు తీగను పట్టుకోవాలని సూచించారు. సభతో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయన్నారు.

Read also: Bandi Sanjay: ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా.. బీఆర్ఎస్ సభను ఎవరు పట్టించుకోలే..

రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి శీల శక్తుల కలయిక కు ఖమ్మం సభ బాటలు వేసిందని అన్నారు. దేశ సంపదను ఇద్దరు గుజరాతిలు మరో గుజారాతీ కి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ఆటలు చెల్లవు గాక చెల్లవు అని ఖమ్మం సభ సందేశం ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతోంది దీన్ని కూడా ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తామన్నారు. రైతుల ఆందోళనలకు బీ ఆర్ ఎస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ ఎస్ కచ్చితమైన మార్పు దిశగా అడుగులు వేస్తుందన్నారు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి.
Harish Rao: ట్విట్టర్, ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టండి.. కాలనీకే కంటి వెలుగు..

Exit mobile version