కాంగ్రెస్ పార్టీని ఓడించే అవసరం మాకు లేదని.. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నే శత్రువంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ని ఓడించే కార్యాచరణ తీసుకోవడం మాకేం అవసరం లేదన్నారు. మాకు మేమె శత్రువులమని వైస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్‌ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో తన కళ్ళకు పరీక్ష చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.