యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ని పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్ లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు. అతడు గోవా కు రెగ్యులర్ గా వెళ్తుంటాడని నిర్దారణకు వచ్చారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురి పై డ్రగ్స్ కేసులు వున్నాయి. ఇప్పటికే మేనేజర్ అనిల్, ఓనర్ అభిషేక్ రిమాండ్ లో వున్నారు.
పరారీలో మరో ఇద్దరు ఓనర్లు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. పబ్ లోకి డ్రగ్స్ ఎవరు తెచ్చారనే దానిపై ముమ్మర విచారణ సాగుతోంది. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కేసులో పోలీసులపై వరుస ఆరోపణలు, విమర్శలు రావడంతో కేసును సవాల్ గా తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసును చేధించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు.
పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్ లో 125 మంది యువతీ యువకులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వారంతా దర్యాప్తు పూర్తయ్యేవరకూ అందుబాటులో వుండాలని ఆదేశించారు. గతంలో కూడా పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దందా నడిచినట్లు గుర్తించారు పోలీసులు. 125 మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? పబ్ కు వచ్చే వారు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా? పబ్ లో డ్రగ్స్ ఎవరి కోసం తెచ్చారా? 125 మందిలో పబ్ కు రెగ్యులర్ గా వచ్చే యువతి యువకుల లిస్ట్ తయారు చేసే పనిలో పడ్డారు పోలీసులు.
డ్రగ్స్ కేసు కొలికి వచ్చే వరకు 125 మంది పోలీసులకు అందుబాటులో ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. 125 మందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు, వారి కోసం అన్వేషిస్తున్నారు.
125 మందిలో పోలీసులకు అందుబాటులో లేని కొందరు యువతి యువకుల్ని ఎలా పట్టుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నారు. పోలీసులు దాడి చేసి సమయంలో 96 మంది యువకులు ..36 మంది యువతులు ఉన్నారు. పోలీసులు పట్టుకున్న వారిలో చాలామంది ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. పబ్ లో పనిచేస్తున్న 20 మంది స్టాఫ్ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు. 20 మందికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్ తోపాటు వాట్సాప్ చాటింగ్ పరిశీలిస్తున్నారు పోలీసులు.