వైద్యాధికారులు వస్తున్నారంటే ప్రైవేట్ ఆస్పత్రులవాళ్ళు హడలిపోతారు. కానీ ఆ ప్రైవేట్ ఆస్పత్రి ఓనర్ మాత్రం సవాల్ చేశారు. తన ఆస్పత్రిని సీజ్ చేసిన డీఎంహెచ్ వో ముందే తనదైన రీతిలో వ్యవహరించాడు. నా ఆస్పత్రి మూస్తే 24 గంటల్లో తెరిపిస్తానంటూ బస్తీమే సవాల్ విసిరాడా డాక్టర్.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? స్వయానా వైద్యారోగ్యశాఖమంత్రి హరీష్ రావు స్వంత జిల్లాలో. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేశారు. పట్టణంలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న రత్నాకర్ ఆసుపత్రిని ఆకస్మికంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో OP తో పాటు ఇన్ పేషెంట్లు కూడా ఉండడాన్ని జిల్లా వైద్య బృందం గుర్తించారు. క్వాలిఫై అయినా వైద్యులు లేకుండా ఆస్పత్రిని కొనసాగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రత్నాకర్ ఆసుపత్రిని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా, క్వాలిఫై అయిన వైద్యులు లేకుండా ఎవరైనా ఆస్పత్రులు కొనసాగిస్తే చర్యలు తప్పవని సూచించారు. ఇది ఇలా ఉండగా సీజ్ చేసిన ఆసుపత్రిని 24 గంటల్లో ఓపెన్ చేస్తానoటూ డాక్టర్ రత్నాకర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ తో సవాల్ విసిరారు.
Read Also: Minister KTR : రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది
ఏ రాత్రయినా పేషెంట్లను రూ,10 రూపాయలు రూ,20 రూపాయలతో ఫీజు తీసుకొని చూస్తానని అవసరమైతే ఫ్రీగా వైద్యం చేస్తానంటూ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే ఎంబిబిఎస్ డాక్టర్లు వైద్యం చేయగలరా అంటూ దురుసుగా మాట్లాడారు. రత్నాకర్ వైద్యుడు మాట్లాడిన మాటలను విన్న అక్కడున్నవారు జిల్లా వైద్య ఉన్నతాధికారుల తీరుపై ఇంతేనా అంటూ చర్చించుకుంటున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిని నడుపుతున్న వైద్యుడు రత్నాకర్ 24 గంటల్లో ఆసుపత్రిని ఓపెన్ చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు దుబ్బాకలో హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ డిఎంహెచ్వో శ్రీనివాస్, పిఓఎంహెచ్ఎన్ రజిని, డి ఐ ఓ విజయ రాణి, తిమ్మాపూర్ పిహెచ్సి వైద్యాధికారి భార్గవి, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు.
Read Also: BCCI: మహ్మద్ షమీని అందుకే ప్రపంచకప్ తుదిజట్టులోకి తీసుకోలేదు