Draupadi Murmu: దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యేషన్ పరేడ్.. హాజరైన రాష్ట్రపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Draupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన కొనసాగుతుంది. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతిని సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇవాళ ఉదయం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి ముర్ము పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రీవ్యూయింగ్ ఆఫీసర్‌గా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలన్నారు.
Read also: Manipur Violence: మణిపూర్ హింస.. బీజేపీ నేతల ఇళ్లకు నిప్పు.. దుండగులపై పోలీసుల కాల్పులు..
Also Read
అధికారులుగా మీరు బాధ్యతలు తీసుకోబోతున్నారని, రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సిరియా, టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని ప్రశంసించారు. కోవిడ్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా అద్భుతంగా పనిచేసిందని అన్నారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఏప్రిల్ లో సుఖాయ్ జెట్ లో ప్రయాణించానని, ఇది నాకు చాలా గొప్ప అనుభూతి అని గుర్తు చేసుకున్నారు. సుమారు 30 నిమిషాలు పాటు సుఖోయ్‌లో ప్రయాణించడం గర్వంగా ఉందన్నారు. ఫైటర్ జెట్ ఫైలెట్లులో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. పరేడ్ అనంతరం క్యాడెట్లు అధికారులుగా తమ తొలి సెల్యూట్ ను రాష్ట్రపతికి చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ద్రౌపతి ముర్ము ఢిల్లీకి పయనం కానున్నారు.
Manipur Violence: మణిపూర్ హింస.. బీజేపీ నేతల ఇళ్లకు నిప్పు.. దుండగులపై పోలీసుల కాల్పులు..
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!