Site icon NTV Telugu

Bandi Sanjay: భార్య పిల్లలను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నా

Bandi Sanjay Nirmal Distric

Bandi Sanjay Nirmal Distric

Bandi Sanjay: మోది చేప్పారని భార్య పిల్లను వదిలేసి ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇవాళ నిర్మల్ జిల్లో 5వరోజు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజల కలుస్తూ వారి బాధలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వేళ కోట్ల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని ఇస్తే పేరుకోసం పాకులాడి డబుల్ బెడ్రూం అన్నాడు.. కానీ ఎవ్వరికి ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికలు వస్తె డబుల్ బెడ్రూం అంటున్నాడని, కట్టిన ఇండ్ల లిస్ట్ అడిగితే ఇవ్వడం లేదని ఆరోపించారు. కవిత లిక్కర్ దందాలో వేల కోట్లు పెట్టిందని, మహిళను ఆడి పోసుకుంటారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో లో(పత్తాలాటలో) పెట్టారని ఆరోపించారు బండి సంజయ్‌. స్కూల్స్ లో టీచర్లు లేరని అన్నారు. కరెంట్ చార్జీలు పెంచారు, బస్ చార్జీలు పెంచుతారని మండిపడ్డారు. వ్యవసాయం చేసే కేసీఆర్ కోటీశ్వరుడు అతే… గ్రామాల్లో రైతులు బికారి అవుతున్నారని విమర్శించారు.

Read also:Indiana Jones: రాజమౌళి కలవరించే సినిమాకి సీక్వెల్ వస్తోంది

ధరణి తెచ్చి ఎవ్వరి భూమి ఎవ్వరీ పేరు మీద ఉన్నదో తెలియదన్నారు. లోన్ రాదు, రైతుభీమా రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదారాబాద్ లో కోట్ల రూపాయల భూములను లాక్కొవాడానికి ధరణి తెచ్చాడని ఆరోపణలు గుప్పించారు. పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు చెల్లుతలేదని, దేశం మొత్తం నవ్వుతుందని అన్నారు. 14 వందల మంది పిల్లలు చనిపోయారని, దొంగ దందాల కుటుంబం కోసమా? తెలంగాణ తెచ్చింది అంటూ ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెళ్ళడం లేదని అంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. పైసలు తీసుకోండి.. కానీ ఓటు అమ్ముకోవద్దని సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు కేసీఆర్ ఓటుకు 70 వేలు ఇచ్చాడని, దొంగ ఓట్లు వేసుకున్నాడని అన్నారు. తక్కువ ఓట్లతో గెలిచాడు. అది గెలుపే కాదని బండి సంజయ్ అన్నారు.
Matti Kusthi Review: మట్టి కుస్తీ మూవీ రివ్యూ

Exit mobile version