Site icon NTV Telugu

Prahlad Singh Patel: కేసీఆర్ అసమర్థ పాలనపై ఫైర్

Prahladsingh

Prahladsingh

కేసీఆర్ అసమర్థపాలనపై మండిపడ్డారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్. ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు బండి సంజయ్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ ఎందుకివ్వడం లేదన్నారు. డీపీఆర్ లేకుండా నీటి కేటాయింపులు లేకుండా ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

ఆర్డీఎస్‌పై కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైంది ? కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఏమైంది..? తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రధాన విషయాలను సీఎం కేసీఆర్ మరిచిపోయారని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ విమర్శించారు. ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. బండి సంజయ్ కుమార్ పాదయాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో పాల్గొన్న ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ సందర్భంగా టీఆర్ఎస్ వైఫల్యాలు, అసమర్థతను ఎండగట్టారు.

ప్రహ్లాద్ సింగ్ పటేల్ కేసీఆర్ అసమర్థ పాలనపై మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు గడిచినా నీళ్లు, నిధుల, నియామకాల సమస్యకు పరిష్కారం కాలేదన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోందనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. RDSలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రహ్లాద్ పటేల్ అన్నారు.

2014 నుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ను ఎందుకు పూర్తిచేయలేకపోయాడన్నారు. కుర్చీ వేస్కొని కూర్చొని ఆర్డీఎస్ పూర్తి చేస్తానని చెప్పి మాట తప్పారన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మిగతా ప్రాజక్ట్ లపై చూపడం లేదని చురకలు అంటించారు. రాష్ట్రంలో హత్యలు, దాడులకు పాల్పడడం సమంజసం కాదన్న మంత్రి ప్రహ్లాద సింగ్ తెలంగాణలో అత్యంత అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు.

Read Also: Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం

Exit mobile version