Ponnam Prabhakar : బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తన గుణం బయటపెట్టింది
- “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం”.. పొన్నం ప్రభాకర్ స్పష్టం
- బీజేపీ ఎంపీలకు మంత్రి సవాలు.. “రాజీనామా చేసి చూపించండి”
- “సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌నే మద్దతు”.. బీసీ వర్గాలకు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యం అనడం బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందlr పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో ఇదే విధమైన రిజర్వేషన్లు అమలు అయ్యాయి. సుప్రీంకోర్టు ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పింది – రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రమాణితమైన సమాచారం, ఎంపెరికల్ డేటా ఉంటే వారు రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవచ్చని” అన్నారు.
“ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది, కేబినెట్ ఆమోదం తీసుకుంది, శాసనసభ ఆమోదం పొందింది. గవర్నర్ ఆమోదంతో అది ఇప్పుడు ఢిల్లీలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన బాధ్యత ఉంది” అని ఆయన అన్నారు.
Also Read
WAR 2 : వార్ 2 ట్రైలర్ డేట్ వచ్చేసింది.. సోషల్ మీడియాలో ‘టైగర్ మోడ్’ ఆన్ అయింది
“తెలంగాణ బీజేపీ ఎంపీలు రిజర్వేషన్ల కోసం రాజీనామా చేయాలి. నిజంగా బీసీల పక్షాన నిలబడాలని ఉంటే, రిజర్వేషన్లు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చూపాలి. లేకపోతే బీసీల పట్ల కుట్ర చేస్తూ ఉంటారని భావించాలి” అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.
అలాగే, “అనాడు మండల కమిషన్‌ను వ్యతిరేకించింది బీజేపీయే. ఇప్పుడు మళ్లీ బీసీల రిజర్వేషన్లపై వక్రబుద్ధిని చూపిస్తోంది. తెలంగాణలోని అన్ని బీసీ సంఘాలు ఈ కుట్రను గమనించి రిజర్వేషన్ హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.
“సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీల పక్షాన నిలుస్తున్నారు. మా పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీ వర్గానికే చెందినవారు. మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.
అదే సమయంలో, బీజేపీపై విరుచుకుపడుతూ, “మీరు ముఖ్యమంత్రి బీసీ అని, సిఎల్పీ నాయకుడు బీసీ అని మభ్యపెడతారు. కానీ పార్టీ అధ్యక్ష పదవిని బీసీ వర్గానికి ఇవ్వని మీరు, మళ్లీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు. ఇది మీ అసలు స్వరూపం” అని మంత్రి ఆరోపించారు.
Aamir Khan : దేశాన్ని ఊపేసిన హనీమూన్ హత్యపై అమీర్ ఖాన్ సినిమా?
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!